స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజయ్యాయి. అయితే ఈ వారం మాత్రం స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ కావడం లేదు. చిన్న సినిమాలో మిమల్ని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటీటీలోని పలు సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో రిలీజయ్యే చిత్రాలు
మారుతీనగర్ సుబ్రహ్మణ్యం
రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ (Maruti Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ముఖ్య కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘నడి వయసులో ఉన్న ఓ మధ్యతరగతి నిరుద్యోగి కథ’గా ఈ మూవీ రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
డిమాంటి కాలనీ 2
అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డిమాంటి కాలనీ 2’. అజయ్ ఆర్.జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్‌కుమార్ నిర్మాతలు. ఆగస్టు 23న ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. తమిళంలో ఈనెల 15న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ఓ మంచి హారర్ థ్రిల్లర్ చూసిన అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలిపారు.
ఓటీటీలోకి విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కల్కిని వీక్షించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో స్టార్ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు.
రాయన్
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్’ (Raayan). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లు సాధించింది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. ఇందులో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ ముఖ్య పాత్ర పోషించాడు. కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, ఎస్.జె సూర్య, శరవణన్ ఇతర పాత్రల్లో కనిపించారు.
Title | Category | Language | Platform | Release Date |
Incoming | Movie | English | Netflix | Aug 23 |
The Frag | Movie | Korean | Netflix | Aug 24 |
Angry Young Men: The Salim-Javed Story | Series | Hindi | Amazon | Aug 20 |
Follow Kar Lo Yaar | Reality Show | Hindi | Amazon | Aug 23 |
Kalki 2898 AD | Movie | Telugu | Amazon | Aug 22 |
Rayan | Movie | Telugu | Amazon | Aug 23 |
Drive Away Dolls | Movie | English | Jio Cinema | Aug 23 |
Grr | Movie | Telugu Dub | Hotstar | Aug 20 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్