ప్రస్తుతం లెడీస్ ఫ్యాషన్ ప్రపంచంలో టిష్యూ చీరలు భారీగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటి ఆకట్టుకునే మెరుపు, డీజైనింగ్ అతివల అందాన్ని పునర్నిర్వచించే విధంగా ఉన్నాయి. తేలికపాటి క్లాత్‌తో- సాధారణంగా సిల్క్, మెటాలిక్ నూలుతో కూడిన ఆహ్లాదకరమైన మిశ్రమంతో తయారు చేయబడిన ఈ చీరలు – ఒక్క చూపులోనే మంత్రముగ్ధులను చేస్తాయి. పార్టీ వేర్‌గా, పండగ సమయాల్లో ధరించే సాంప్రదాయ వస్త్రంగా పడతుల ప్రేమను చూరగొంటోంది.
ఒకప్పుడు సంపన్న వర్గానికే ప్రాధాన్యంగా ఉన్న టిష్యూ చీరలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందుతున్నాయి. మీరు ఎదైనా హై ప్రొఫైల్ ఈవెంట్ కోసం తయారవుతున్నా లేదా సాధారణ ఈవెంట్‌లకు హాజరవుతున్నా, ఈ చీర కట్టుతో(Tissue silk Sarees) అందరిలో మీరు ప్రత్యేకంగా నిలుస్తారు.డిజైనర్లు సంప్రదాయ వస్త్రాలను సరికొత్తగా మోడలింగ్ చేసి నేటి అతివల అభిరుచులకు తగ్గట్టుగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టిష్యూ సిల్క్ చీరలను సెలబ్రిటీలు క్రేజీగా ధరిస్తున్నారు. ఫలితంగా ఈ వస్త్రం ట్రెండీగా చలామణీ అవుతోంది. నేటి ఫ్యాషన్‌కు ఐకానిక్‌గా మారిన ఈ టిష్యూ చీరను ధరించిన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రెబా మోనికా జాన్
రెబా మోనికా జాన్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేనటువంటి నటి. తెలుగులో లేడీస్ నైట్ , సామజవరగమన సినిమా ద్వారా పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ ట్రెండీ వేర్‌ను ధరించడంలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా టిష్యూ సిల్క్ చీరను ధరించిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. గోల్డిష్ బ్రౌన్ కలర్ షేడ్‌లో డిజైనర్ ట్రెండింగ్ క్రష్ టిష్యూ సిల్క్ చీర ఇది. ముఖ్యంగా పండుగ సమయాల్లో ధరించేందేకు ఇది మంచి ఎంపిక.
కీర్తి సురేష్
తెలుగింటి అందంలా ఉండే కీర్తి సురేష్ ధరించిన టిష్యూ సిల్క్ చీరను మీరు ఓసారి ఆస్వాదించండి. ఐకానిక్ లుక్‌లో కీర్తి మరింత అందంగా కనిస్తోంది కదా. ఈ చీర సాంప్రదాయ, ఆధునిక శైలుల సమ్మేళనం.
కియరా అద్వాని
కియారా అద్వాని టిష్యూ చీరతో పొందిన అందాన్ని మీరు పొందాలనుకుంటే ఈ చీర మీకు బెస్ట్ చాయిస్‌గా చెప్పవచ్చు. (Tissue silk Sarees) ప్రత్యేక సందర్భాలలో పార్టీటైం, ట్రెడిషినల్ ఫెస్టివల్స్ సమయంలో అతివలకు బాగా నప్పుతుంది. ఇక కియరా అద్వాని తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి మెప్పించింది.
జాన్వీ కపూర్
టిష్యూ సిల్క్ చీరలకు అనధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా జాన్వీ కపూర్‌గా చెప్పవచ్చు. ఆమె పలు సందర్భాల్లో ఈ చీరను కట్టి తన అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకుంది. లైట్ పింక్ కలర్, గొల్డెన్ జరీతో వచ్చిన ఈ చీర అన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుందనడంలో సందేహం లేదు.
శివాత్మిక రాజశేఖర్
శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఎప్పుడూ సాంప్రదాయ(Tissue silk Sarees) వస్త్రాలు ధరిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తూ ఉంటుంది. లెమన్ గ్రీన్ కలర్ టిష్యూ సిల్స్ శారీ నిజంగా శివాత్మికకు ఐకానిక్ లుక్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఈ చీర ఎలాంటి కలర్ టోన్ ఉన్నవారికైనా బాగా నప్పుతుంది.
త్రిష
త్రిషకు చీర బాగా నప్పుతుంది. ముఖ్యంగా “పొన్నియిన్ సెల్వన్-I” ప్రమోషన్ ఈవెంట్‌లో నల్లటి టిష్యూ సిల్క్ చీర ధరించి(Tissue silk Sarees) అందరి దృష్టిని ఆకర్షించింది. సిల్కీ జరీ చారలు, బ్లాక్ కలర్ బ్లౌజ్‌లో అందంగా కనిపించింది. ఈ చీర ముఖ్యంగా పార్టీ సమయాల్లో బాగా సూట్ అవుతుంది.
సమంత
సమంత ఫ్యాషన్ ఐకాన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సరికొత్త ట్రెండ్స్‌ను పరిచయం చేయడంలో ఆమె ముందుంటారు. సిల్వర్ కలర్ టిష్యూ చీరలో ఈ ముద్దుగుమ్మ మరింత క్యూట్‌గా తయారైంది. ఈ కలర్ అవుట్ సైడ్ పార్టీలకు బాగా సెట్ అవుతుంది.
భాగ్యశ్రీ బోర్సే
టాలీవుడ్ లెటెస్ట్ సంచలనం భాగ్యశ్రీ బోర్సే సైతం టిష్యూ చీరలో మెరిసింది. ఆరెంజ్ కలర్ శారీ, అదే కలర్ బ్లౌజ్‌లో ఈ అమ్మడి అందం మైండ్ బ్లోయింగ్ చేస్తోంది. ఇక తాజాగా రవితేజతో నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా.. భాగ్యశ్రీకి తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌తో నెక్స్ట్ సినిమాల్లో నటిస్తోంది.
రష్మిక మంధాన
రష్మిక మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందింది. ఎప్పుడూ సాంప్రదాయ వస్త్రాలు ధరిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తూ ఉంటుంది. మిల్కీ వైట్ టిష్యూ సిల్క్ కలర్ శారీ నిజంగా రష్మికకు ఐకానిక్ లుక్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఈ చీర ఎలాంటి కలర్ టోన్ ఉన్నవారికైనా బాగా నప్పుతుంది.
కాజల్ అగర్వాల్
ఐవరీ కలర్ టిష్య్ సిల్క్ చీరలో కాజల్ అగర్వాల్ అందం ద్విగుణీకృతం అయిందని చెప్పవచ్చు. ఈ టైప్ కలర్ ఎలాంటి శుభకార్యాలకైనా, పండుగలకైనా అతివలకు బాగా నప్పుతుంది.
శోభిత దూళిపాళ
అక్కినేని నాగచైతన్య కాబోయే భార్య , తెలుగింటి అందం.. శోభిత దూళిపాళ ఫ్యాషన్ ప్రపంచంలో ఐకాన్‌గా చెప్పవచ్చు. (Tissue silk Sarees)మోడ్రన్ ట్రెండ్‌లోనైనా, ట్రెడిషనల్ ట్రెండ్ అయినా ఇట్టే తనలో కలిపేసుకుంటుంది. గొల్డెన్ జరీ చీరలో ఈ ముద్దుగుమ్మ అందం మరింత పెరిగింది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?