• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్‌ అయిన తెలుగు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు ఇవే!

    భారత చలనచిత్ర పరిశ్రమలో రీమేక్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సహజంగా ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని కంటెంట్‌ బాగుంటే మరో భాషలోకి రిమేక్‌ చేస్తుంటారు. కొత్త నటీనటులను పెట్టి వారి నేటివిటికి అనుగుణంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుంటారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మలయాళం, భోజ్‌పూరి, బెంగాలి పరిశ్రమల్లో ఇలా పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌ (Telugu movies that have been remade in most languages) నుంచే ఏటా ఎక్కువ సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం.. ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యి ఇటీవల సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగులో రూపొంది మూడు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో రీమేక్‌ అయిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana)

    టాలీవుడ్‌లో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా‘ (2005) చిత్రం.. తొమ్మిది భాషల్లో రీమేకైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో (తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, మణిపురి, పంజాబీ, బెంగాలీ), 2 విదేశీ భాషల్లో (బంగ్లాదేశ్‌ బెంగాలీ, నేపాలి) భాషల్లో అనువదింప బడింది. తెలుగులో సిద్ధార్థ్‌, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. 

    ఒక్కడు (Okkadu)

    మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లో రిమేక్‌ చేయబడి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ (Vijay) ‘గిల్లీ’ పేరుతో ఈ సినిమాను రీమేక్‌ చేయగా.. కన్నడలో ‘అజయ్‌’ పేరుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ (Punit Raj Kumar) నటించాడు. 

    మర్యాద రామన్న (Maryada Ramanna)

    దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కూడా ఐదు భాషల్లో రీమేక్ కావడం విశేషం. సునీల్‌ (Sunil) హీరోగా చేసిన ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం గమనార్హం. హిందీలో ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’ పేరుతో రాజమౌళినే ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇందులో అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు. 

    వర్షం (Varsham)

    ప్రభాస్‌ (Prabhas), త్రిష (Trisha) జంటగా 2004లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘వర్షం‘. శోభన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఎక్కువ భాషల్లో రూపొందింది. ఒడియాలో ‘మై డార్లింగ్‌’ (2004), తమిళంలో ‘మజాయ్‌’ (2005), హిందీలో ‘భాగీ’ (2016) పేరుతో రిలీజై మంచి ఆదరణ పొందింది. 

    ఛత్రపతి (Chatrapathi)

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను అందించింది. అయితే మూడు భాషల్లో రీమేక్‌ అయ్యింది. కన్నడ, బెంగాలి భాషల్లో రిఫ్యూజ్‌ పేరుతో విడుదల కాగా, హిందీలో రీసెంట్‌గా ఛత్రపతి పేరుతోనే విడుదలైంది. వి.వి వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది.

    పోకిరి (Pokiri)

    మ‌హేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ పోకిరి సినిమా.. 4 భాష‌ల్లో రిమేక్ అయ్యింది. తమిళంలో విజయ్‌ హీరోగా ‘పొక్కిరి’ (2007), హిందీలో సల్మాన్‌ ఖాన్ హీరోగా ‘వాంటెడ్‌’ (2009), కన్నడలో దర్శన్‌ హీరోగా ‘పొర్కి’ (2010) పేరుతో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఉర్దూలోనూ ఈ సినిమా రీమేక్ అయినప్పటికి కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే హిందీలో ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించడం విశేషం. 

    డార్లింగ్‌ (Darling)

    ప్రభాస్‌ హీరోగా 2010లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఏ. కరుణాకరణ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ సాధించడంతో పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేశారు. కన్నడలో దర్షన్‌  హీరోగా ‘బుల్‌బుల్’, హిందీలో ‘సబ్సే బధాకర్‌ హమ్‌’ పేరుతో రీమేకై అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. బెంగాలీలోనూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు మెుదలు కాగా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. 

    విక్రమార్కుడు (Vikramarkudu)

    రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో ‘వీర మదకారి’ (2009), తమిళంలో ‘సిరుతాయ్’ (2011), హిందీలో ‘రౌడీ రాతోడ్‌’ (2012), బంగ్లాదేశ్‌ బెంగాలీలో ‘ఉల్టా పల్టా 69’ (2007), ‘యాక్షన్‌ జాస్మిన్’ (2015) పేర్లతో రెండుసార్లు రీమేక్ అయ్యింది. 

    మిర్చి (Mirchi)

    ప్రభాస్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి కూడా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో ‘మాణిక్య’, బెంగాలీలో ‘బిందాస్‌’, ఒడియాలో ‘బిశ్వంత్‌’  పేర్లతో రిలీజ్‌ అయ్యింది. ఇక హిందీలో ఈ సినిమాకు సంబంధించిన రైట్స్‌ను స్టార్ నటుడు జాన్‌ అబ్రహం దక్కించుకున్నప్పటికీ ఇప్పటివరకూ సినిమా చేయలేదు.

    ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే

    వెంక‌టేష్ (Venkatesh) హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా 5 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది. త‌మిళం, బెంగాలీ, భోజ్‌పురి, క‌న్న‌డ‌, ఒడియా భాష‌ల్లోకి రిమేక్ చేయ‌బ‌డింది. అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv