• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TOP 5 FASTEST BIKES IN INDIA 2023: వీటిని మించిన వేగం.. స్టైలిష్ లుక్ మీరెక్కడ చూసి ఉండరు

    మీరు ఫాస్ట్ రైడ్ ఇష్టపడే ఔత్సాహికులా? బైక్‌పై రయ్ రయ్‌ మంటూ చక్కర్లు కొట్టడమంటే ఇష్టమా? అయితే ఈ కథనం మీకోసమే. భారత్‌లో అత్యంత వేగంతమైన టాప్ 5 బైక్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటి ప్రత్యేకతలు తెలిస్తే నిజంగా మైండ్ బ్లోయింగే. వీటి డీజైన్, పవర్ టార్క్ అన్ని వేటికవి యూనిక్‌గా ఉన్నాయి.  మరి ఆ ఫాస్టెస్ట్ బైక్‌లు ఏంటో ఓసారి తెలుసుకుందామా..

    కవాసకి నింజా H2

    భారత్‌లోని అత్యంత థ్రిల్లింగ్ రైడ్‌ బైక్‌లలో ఒకటిగా పేరుగాంచింది. సూపర్ ఫాస్ట్ రైడర్లకు ఇదొక మంచి ఎంపిక. 998cc ఇంజిన్ కెపాసిటీతో 197bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది. 10500 rpm వద్ద 156 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 331-400Kmph స్పీడ్‌తో ప్రయాణించగలదు. అందుకే ఈ బైక్‌ను స్పీడ్ రైడర్స్‌లో రారాజుగా పేర్కొంటారు.

    BMW S1000 RR

    చూడగానే కొనెయాలి అనిపించే ఆకట్టుకునే లుక్‌ దీని సొంతం. దీని అగ్రెసివ్ లుక్ యూత్ మనసులను ఇట్టే దొచేస్తుంది. ఈ సూపర్ బైక్ 999cc ఇంజిన్ సామర్థ్యంతో 4 సిలిండర్స్‌ను కలిగిఉంటుంది. ఇది 13500rpm వద్ద 193bhp శక్తిని, 10500rpm వద్ద 113 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 303Kmph. ఈ జర్మన్ అద్భుతం మీకు మంచి రైడింగ్ అనుభవాన్ని అయితే ఇస్తుంది.

    Ducati Panigale V4

    Ducati Panigale V4 ఇటాలియన్ స్టైలిష్‌లో బ్లిస్టరింగ్ పనితీరును కనబరుస్తుంది. దీని 1103 cc V4 ఇంజన్ 13000 rpm వద్ద శక్తివంతమైన 211 bhp, 10000 rpm వద్ద 124 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.  ఇది గంటకు 300 kmph కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. Panigale V4 డుకాటీ స్టైలిష్ లుక్స్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం.

    Suzuki Hayabusa

    వేగం, శక్తికి చిహ్నంగా సుజుకి హయబుసా బైక్‌కు భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఇది 1340 cc ఇన్‌లైన్-ఫోర్-సిలిండర్ ఇంజిన్ 9500 rpm వద్ద ఆకట్టుకునే 197 bhpని ఉత్పత్తి చేస్తుంది, దీనితో పాటు 7200 rpm వద్ద 150 Nm టార్క్ విడుదల చేస్తుంది. ఈ థండర్ బైక్ 312 kmph గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. ఈ సూపర్ బైక్ తన మెస్మరైజింగ్ లుక్స్‌తో యూత్‌లో మంతి క్రేజ్ సంపాదించింది.

    MV Agusta F4 RR

    మెరుగైన పనితీరు, ఆకట్టుకనే డీజైన్ దీని సొంతం. MV అగస్టా F4 RR ఒక ఆధునిక క్లాసిక్. 298 kmph గరిష్ట వేగంతో, ఇది శక్తివంతమైన 998 cc ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది,  201 hp, 111 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లైట్‌ వెయిట్‌తో యూనిక్ బాడీ కలిగిన ఈ థండర్ బైక్ రైడర్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్‌నుఅందిస్తుంది.

    Aprilia RSV4 RF

    ట్రాక్ ఔత్సాహికుల కోసం రూపొందించిన, అప్రిలియా RSV4 RF పరిమిత-ఎడిషన్ మోడల్, ఇది గొప్ప థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని 999 cc ఇంజన్ 198.2 bhp, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది సాటిలేని శక్తికి, కచ్చితత్వానికి ప్రతీక.  300 kmph గరిష్ట వేగంతో దూసుకెళ్లే ఈ సూపర్ బైక్ నిజమైన ట్రాక్ వారియర్‌గా పేరు గడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv