సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఆయూర్వేదం కీలకమైనది. నేటి ఆధునిక జీవన శైలీలో ఎన్నో సమస్యలకు ఆయుర్వేదం చక్కని పరిష్కారాన్ని అందిస్తోంది. కేవలం వ్యాధులను నయం చేయడానికి మాత్రమే కాకుండా సౌందర్య పోషణలోనూ గొప్ప ఫలితాన్ని అందిస్తోంది. సౌందర్య పోషణ పట్ల నేటి యువత చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రసాయన పూరితమైన సౌందర్య ఉత్పత్తులను ఎంచుకుని చర్మ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖానికి సహజమైన సౌందర్యం అందించే ఐదు రకాల ఆయుర్వేద ఫేస్ ప్యాక్ రెమెడీలను మీకోసం అందిస్తున్నాం. ఈ నేచురల్ ఫేస్ ప్యాక్‌ల వల్ల మొటిమలు తగ్గడంతో పాటు వివిధ రకాల చర్మ సమస్యలు దరి చేరవు. మరి ఆ ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. బంతి పూల గుజ్జుతో ఫేస్ ప్యాక్
బంతి పువ్వును మేరి గోల్డ్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఈ పూల గుజ్జులో చర్మ సౌందర్యానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా కొన్ని బంతిపూలు 3-5 తీసుకుని వాటిని పేస్ట్‌గా మార్చుకోవాలి. తర్వాత ఒక టేబుల్ టీ స్పూన్ తేనేను వేడి చేసి పేస్ట్‌లో కలపాలి. నెక్ట్స్ 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు పోసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మిశ్రమాన్ని పక్కకు పెట్టండి. తర్వాత మీ ముఖానికి పేస్ట్‌ను జాగ్రత్తగా మెడ వరకు ప్యాక్ చేసుకోండి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వారంలో కనీసం మూడు సార్లు చేస్తే సహజమైన ముఖ సౌందర్యాన్ని పొందవచ్చు.
2. శనగపిండి &పసుపుతో ఫేస్ ప్యాక్
శనగపిండి అందరి ఇళ్లో ఉండే సాధారణ వంట పదార్థం. ఇక పసుపు గురించి చెప్పనక్కర లేదు. పసుపులో ఎన్నోరకాలైన ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఫెస్ ఫ్యాక్ పొడి చర్మంతో బాధపడేవారికి ఉద్దేశించబడింది. ఈ ఫేస్ ప్యాక్ రూపొందిచేందుకు మీకు.. 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని నీళ్లు లేదా పాలు అవసరం. ముందుగా శనగపిండిని పసుపుతో పాలు లేదా నీళ్లతో కలుపుకుని లూజ్ పేస్ట్‌గా మార్చుకోవాలి. అనంతరం ఈ ఫేస్ ప్యాక్‌ను తడిగా ఉన్న మీ ముఖానికి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను రెగ్యూలర్‌గా యూజ్ చేయడం వల్ల మొటిమలు వంటి సమస్యను నివారించవచ్చు.
3.చందనం ఫేస్ మాస్క్
చందనం లేదా గంధంలో చర్మ సంరక్షణకు అవసరమైన అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దాదాపు అన్ని కాస్మోటిక్స్ గంధంతో తయారవుతాయనే సంగతి తెలిసిందే. చందనం మొటిమలను సమర్థవంతంగా నివారించడంతో సాయపడుతుంది. అంతేకాదు ముఖానికి సహజ కాంతిని అందిస్తుంది. ఈ ఫేస్ మాస్క్ తయారు చేసేందుకు 2 టేబుల్ స్పూన్ల గంధం, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అవసరం. ముందుగా చందన్ పౌడర్‌ను రోజ్ వాటర్‌తో బాగా కలిపి పేస్ట్‌గా మార్చుకోవాలి. ఈ మాస్క్‌ని తడిగా ఉన్న చర్మానికి అప్లై చేసి, ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించుకోవచ్చు.
4. తేనే, నిమ్మకాయతో సౌందర్య పోషణ
తేనెలో చర్మ సౌందర్యానికి అవసరమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజ్ చేయడానికి సాయపడుతుంది. ఇక నిమ్మరసంలో చర్మానికి అవసరమైన విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మంలో నలుపు రంగు కారణమయ్యే మెలనిన్‌ను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం జీవం పోసుకుని కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు ముందుగా.. ఒక టేబుల్ స్పూన్ తేనెను వేడి చేయండి. అందులో మరో టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపండి. ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్‌ను తడిగా ఉన్నా మీ ముఖానికి అప్లై చేసుకుని ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మీ చర్మం నిత్యం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు దీనిని రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవచ్చు.
5.హెర్బల్ ఫేస్ మాస్క్
శనగపిండి చర్మంలో మృతకణాలు తొలగించి పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి,1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పసువు అవసరం. వీటన్నింటి మిశ్రమాన్ని బాగా కలుపుకుని పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ ఫేస్ మాస్క్‌ను తడిగా ఉన్న మీ చర్మానికి మృదువుగా అప్లై చేసుకోవాలి. ఆరిపోయేంత వరకు ఉంచుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని నిత్యం వాడటం వల్ల మీ చర్మం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది. ఇది బెస్ట్ ఆయుర్వేద హోమ్ మేడ్ ఫేస్ ఫ్యాక్‌గా చెప్పవచ్చు.
సమీక్ష
ఆయుర్వేద ఫేస్ ప్యాక్‌లు చర్మ సౌందర్య పోషణలో మంచి ఫలితాన్ని రాబట్టేవే. అయితే ఈ ఆయుర్వేద రెమెడీలు అందరికీ సూట్ కాకపోవచ్చు. ఫేస్ ఫ్యాక్ ఉపయోగించేటప్పుడు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. అంటే కొంచెం ఫేస్ ఫ్యాక్‌ను తొలుత చర్మంపై అప్లై చేసుకోని ఎలాంటి అలర్జీ, దుష్ప్రాభావం కలగడం లేదని నిర్ధారించుకున్నాక వాడితే మంచిది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!