శీతాకాలంలో యువతను ప్రధానంగా వేధించే సమస్య చర్మం పొడిబారడం. చల్లని గాలుల వల్ల చర్మం పొడిబారి తెల్లగా కాంతిహీనంగా మారిపోతుంటుంది. దానికి తోడు చర్మంపై మంట తీవ్రంగా వేదిస్తుంటుంది. అయితే కొన్ని రకాల క్రీమ్స్ అప్లై చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల వింటర్ స్కిన్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యుత్తమైన వాటిని YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. వాటి గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.
Mamaearth CoCo Nourishing
చర్మం పొడిబారకుండా తేమగా, కాంతివంతంగా ఉండేందుకు ఈ క్రీమ్ ఉపయోగపడుతుంది. సహజమైన పదార్థాలతో దీనిని తయారు చేశారు. విటమిన్ E, కాఫీ, కొబ్బరి నూనె ఇందులో ఉంటాయి. ఇది ఆంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంది. ఇది మీ చర్మాన్ని మాయిశ్చర్‌గా ఉంచుతూ చలి గాలుల నుంచి రక్షిస్తుంది. అమెజాన్‌లో రూ.285లకు ఈ క్రీమ్ అందుబాటులో ఉంది.
Luvyh Aloe Vera Cold Cream
శీతాకాలంలో మంచి క్రీమ్ కోసం చూసే వాళ్ళు దీనిని పరిశీలించవచ్చు. ఈ క్రీమ్ మీ చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు ఈ క్రీమ్‌ను వినియోగించవచ్చు. యాక్ని (Acne), డ్రై స్కిన్ (Dry Skin) ఉన్న వాళ్ళకి కూడా ఇది సత్ఫలితాలు ఇస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.139లకు సేల్ అవుతోంది.
Biotique Winter Cream
ఆయుర్వేద గుణాలతో తయారైన క్రీమ్‌ను కోరుకునే వారు Biotique Winter Cream ట్రై చేయవచ్చు. వేప, పసుపు ఈ కోల్డ్ క్రీమ్‌లో ఉన్నాయి. ఈ క్రీమ్ చర్మానికి అప్లై చేయడం వలన మీ స్కిన్ మృదువుగా, మరింత కాంతివంతంగా తయారవుతుంది. చర్మంలో గ్లో కూడా పెరుగుతుంది. యాక్ని ప్రోన్ స్కిన్ కలిగిన వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీని ధర రూ.156.
GEMBLUE BioCare Winter
ఈ వింటర్ క్రీమ్ కూడా మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. అలానే స్కిన్‌ను సాఫ్ట్‌గా, అందంగా మెరిసేలా చేస్తుంది. ఈ క్రీమ్‌ను అప్లై చేయడం ద్వారా మీ చర్మం చాలా బాగుంటుంది. ఇందులో తేనె, అవకాడో కూడా ఉంది. అమెజాన్‌లో ఇది రూ.199లకు అందుబాటులో ఉంది.
I TOUCH HERBAL
హెర్బల్ వింటర్ క్రీమ్ మీ ఛాయిస్ అయితే I TOUCH HERBAL పరిశీలించవచ్చు. ఈ క్రీమ్ ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా పొల్యూషన్ బాధ తప్పుతుంది. అలోవెరా, విటమిన్ A, తేనె, బాదం, మల్టీ విటమిన్స్ గుణాలు ఇందులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.399. కానీ అమెజాన్ 43% డిస్కౌంట్‌తో రూ.229 లకే అందిస్తోంది.