• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 8 Convection Microwave 2023: మైక్రోవేవ్‌ ఓవెన్‌ల గురించి ఈ విషయాలు తెలుసా? మార్కెట్‌లో టాప్‌ ఇవే!

    ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శ్రమను, కాలాన్ని ఆదా చేస్తూ ఎన్నో సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి మన ఇంట్లోని కిచెన్ ఏమీ మినహాయింపు కాదు. ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఇంట్లోనూ ‘మైక్రోవేవ్‌ ఓవెన్స్‌’ (Microwave ovens) కనిపిస్తున్నాయి. వీటి ద్వారా ఆహారాన్ని త్వరగా వేడి చేసుకోవడంతో పాటు, వెరైటి వంటలను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల మైక్రోవేవ్ ఓవెన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి కన్విక్షన్‌ మైక్రోవేవ్స్‌ కాగా, రెండోది స్టాండర్డ్‌ లేదా సోలో మైక్రోవేవ్‌. వీటి మధ్య ఉన్న వ్యాత్యాసాలను తెలయజేయంతో పాటు, మార్కెట్‌లోని టాప్‌-8 కన్విక్షన్ మైక్రోవేవ్స్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.  

    కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌ VS స్టాండర్డ్‌ మైక్రోవేవ్‌

    వర్కింగ్‌ విధానం

    స్టాండర్డ్‌ మైక్రోవేవ్‌.. ఆహార పదార్థాలను వేడి చేయడానికి రేడియేషన్‌ను ఉపయోగిస్తుంది. అదే కన్వెక్షన్ మైక్రోవేవ్‌ అయితే హీటింగ్‌ ఎలిమెంట్‌తో వర్క్‌ చేస్తుంది. ఇది ముందుగా ఓవెన్‌ లోపలున్న గాలిని వేడి చేస్తుంది. దాని సాయంతో ఆహారానికి హీట్‌ను అందిస్తుంది. గోధుమ వంటకాలను ఎక్కువగా తినేవారికి కన్వెక్షన్ మైక్రోవేవ్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. 

    వంటల పరంగా..!

    సాధారణంగా స్టాండర్డ్‌ మైక్రోవేవ్‌ను ఎక్కువగా ఆహారాన్ని వేడిచేయడం, చిన్న చిన్న వంటలు, Defrosting కోసం వినియోగిస్తుంటారు. అదే కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌లో చాలా కుకింగ్‌ ఆప్షన్స్ ఉంటాయి. దీని ద్వారా ఆహారాన్ని రోస్ట్‌ (Roast), బేక్‌ (Bake), గ్రిల్‌ (Grill) చేయవచ్చు. 

    కుకింగ్‌ టైమ్‌ – నాణ్యత

    స్టాండర్డ్‌ మైక్రోవేవ్‌ ఓవెన్‌ రేడియేషన్‌తో పనిచేయం వల్ల ఆహారాన్ని త్వరగా వేడి చేసేందుకు వీలు పడుతుంది. అయితే అది అంతే ఫాస్ట్‌గా ఆహారాన్ని కుక్‌ చేయలేదు. కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌ అలా కాదు. కుకింగ్‌ కాస్త ఆలస్యమైనప్పటికీ ఆహారాన్ని కోరుకున్న విధంగా అందిస్తుంది. 

    విద్యుత్‌ వాడకం..!

    స్టాండర్డ్‌ మైక్రోవేవ్‌తో పోలిస్తే కన్వెక్షన్‌ మైక్రోవేవ్స్‌ తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. తద్వారా అధిక విద్యుత్‌ ఛార్జీల బారి నుంచి అవి మిమ్మల్ని కాపాడతాయి. 

    ధర విషయానికోస్తే..!

    కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌తో పోలిస్తే స్టాండర్డ్‌ లేదా సోలో మైక్రోవేవ్‌లు తక్కువ ధరకే లభిస్తాయి. కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌ కాస్త ప్రియంగా ఉన్నప్పటికీ అవి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటాయి.

     

    మార్కెట్‌లోని టాప్‌-8 కన్వెక్షన్‌ మైక్రోవేవ్స్‌

    LG 28 L Charcoal 

    మార్కెట్‌లో ఉన్న బెస్ట్‌ కన్వెక్షన్‌ మైక్రోవేవ్స్‌లో ‘LG 28 L Charcoal’ ఒకటి. 28 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మైక్రోవేవ్‌.. పెద్ద ఫ్యామిలీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది 2450 మైక్రోవేవ్‌ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ మైక్రోవేవ్‌ రూ.17,920కు అందుబాటులో ఉంది. 

    Samsung 28L Slim Fry

    శాంసంగ్‌ నుంచి కూడా క్వాలిటీ కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌ అందుబాటులో ఉంది. Samsung 28L Slim Fry ధర అమెజాన్‌లో రూ.12,390గా ఉంది. దీనికి 28 లీటర్ల సామర్థ్యం ఉండటం వల్ల పెద్ద ఫ్యామిలీలు కూడా దీన్ని వియోగించవచ్చు. ఈ మైక్రోవేవ్‌ చైల్డ్‌ లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. కాబట్టి ఇంట్లోని పిల్లలు ఏమరుపాటుగా దీన్ని తెరిచిన చైల్డ్‌ లాక్‌ వల్ల అది ఓపెన్‌ కాదు. 

    IFB 30 L Convection Microwave 

    30 లీటర్ల సామర్థ్యంతో దీన్ని తీసుకొచ్చారు. ఇది బేకింగ్‌, గ్రిల్లింగ్‌, రీహీటింగ్‌, డిఫ్రోస్టింగ్‌, కుకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ మైక్రోవేవ్‌కు అదనంగా స్టార్టర్‌ కిట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. దీని అసలు ధర రూ.19,390 కాగా, అమెజాన్‌ దీనిపై 23 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఈ మైక్రోవేవ్‌ రూ.14,990కి అందుబాటులోకి వచ్చింది. 

    LG 32 L Convection Microwave 

    LG కంపెనీ నుంచే మరో క్వాలిటీ కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌ మార్కెట్‌లో లభిస్తోంది. ‘LG 32 L Convection Microwave’కు యూజర్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. ఇది 32 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 211 ఇండియన్‌ ఆటో కుక్‌ మెనూ ఆప్షన్స్‌ (211 Indian auto cook menu options), ఆహారాన్ని పులియబెట్టే ఫీచర్ ఉంది. ఇది ప్రైస్‌ రూ.17,990.

    Whirlpool 29 Litres

    ఈ కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌ 29 సామర్థ్యంతో తయారైంది. ఇందులో 300 రకాల ఆటో కుక్‌ మెనూలు (300 Auto Cook Menus) ఉన్నాయి. ఈ మోడ్స్‌ను ఉపయోగించి అద్భుతమైన, రుచికరమైన వంటకాలను చేసుకోవచ్చు. ఈ మేక్రోవేవ్‌ సాయంతో తందూరి వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చు. అమెజాన్‌లో దీని ప్రైస్‌ రూ.12,190గా ఉంది. 

    Panasonic 27L 

    పానాసోనిక్‌ కంపెనీకి చెందిన మైక్రోవేవ్‌ కొనాలని భావించేవారు ‘Panasonic 27L’ను ట్రై చేయవచ్చు. దీనిని 27 లీటర్ల సామర్థ్యంతో తీసుకొచ్చారు. ముగ్గురు లేదా నలుగురు సభ్యులున్న చిన్న ఫ్యామిలీకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇందులో 101 ఆటో కుక్‌ మెను ఉంది. అమెజాన్‌లో రూ.11,990లకు లభిస్తోంది. 

    Morphy Richards 30 MCGR Deluxe

    రెండు సంవత్సరాల వారంటీతో ఈ మైక్రోవేవ్‌ను తీసుకొచ్చారు. దీనికి 30 లీటర్ల సామర్థ్యాన్ని అందించారు. ఇది ఆకర్షణీయమైన మిర్రర్‌ గ్లాస్‌ డోర్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.19,595 కాగా, అమెజాన్ దీనిపై ఏకంగా 44 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఈ మైక్రోవేవ్‌ను రూ.10,990కే సొంతం చేసుకోవచ్చు. 

    Haier 22L Convection Microwave

    రూ.10వేల లోపు బెస్ట్‌ కన్వెన్షన్‌ మైక్రోవేవ్‌ కోరుకునే వారు ‘Haier 22L Convection Microwave’ను పరిశీలించవచ్చు. ముగ్గురు లేదా నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఈ మైక్రోవేవ్‌ బెస్ట్ ఆప్షన్. ఇందులో 195 Auto cook menus ఉన్నాయి. ఆయిల్‌ ఫ్రీ కుకింగ్‌ ఫీచర్‌ను కూడా దీనికి అందించారు. అమెజాన్‌లో ఈ మైక్రోవేవ్‌ రూ. 9,490లకే లభిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv