• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Triumph Speed 400: ఇండియాలో దీనిని మించిన బైక్ ఉందా? యూత్ మాత్రం కచ్చితంగా ఓ లుక్‌ వేయాల్సిందే! 

    ఇండియాలో యూత్‌తో పాటు రోడ్ రైడర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రయంప్ స్పీడ్ 400 (Triumph Speed 400) బైక్ భారత మార్కెట్‌లోకి లాంచ్ అయింది. బ్రిటిష్ కంపెనీ ట్రయంప్, బజాజ్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ బైక్‌ను తయారు చేసింది. సింగిల్ ఇంజిన్‌తో అభివృద్ధి చేసిన ఈ స్టైలీష్ బైక్,  రైడర్లకు మంచి రోడ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిని బ్రిటీష్ స్టైల్ డిజైన్‌లో రూపొందించారు. బజాజ్‌కు చెందిన చాకన్ ప్లాంట్‌లో తయారు చేశారు. 398సీసీ సింగిల్ సిలిండర్‌తో వస్తున్న ఈ బైక్ ప్రత్యేకతలపై ఓ లుక్‌ వేద్దాం..

    ఇండియా నెటివెటికి తగ్గట్టుగా..

    బ్రిటిష్ మోటర్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంప్ దేశీయ బజాజ్ ఆటో సహకారంతో  స్పీడ్ 400, స్క్రాంబులర్ 400X ( Scrambler 400X ) బైక్‌లను తయారు చేసింది. తాజాగా ట్రయంప్ స్పీడ్ 400 బైక్‌ను లాంచ్ చేసింది. ఇండియన్ రోడ్లకు తగ్గుట్టుగా బైక్‌ను డీజైన్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

    ట్రయంప్ స్పీడ్ 400, 400X ప్రత్యేకతలు

    ట్రయంప్ స్పీడ్ 400, స్క్రాంబులర్ 400X  రెండూ కూడా సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్  398cc ఇంజిన్ సామర్థ్యంతో రానున్నాయి. ఇంజిన్ 39.45bhp, 37.5Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు. సీక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో రానున్నాయి.

    ఆకర్షనీయమైన డిజైన్

    ఈ రెండు బైక్‌లను అత్యంత ఆకర్షనీయంగా డిజైన్ చేశారు. స్పీడ్ ట్రయంప్ 400 క్లాసిక్ లుక్ డిజైన్‌ను మరింత ద్విగుణీకృతం చేసింది. ట్రెడిషనల్ హెడ్ లైట్, అప్స్‌వెప్ట్ సైలెన్సర్, స్క్రీమి బాడీ పెయింట్, లోగో, గోల్డ్ కలర్ 43nm ఫ్రంట్ పోర్క్స్ అదనపు ఆకర్షణలు. 790mm సీట్ హైట్‌ కల్గి ఉన్నాయి. ఇవన్నీ ట్రయంప్ స్పీడ్ 400కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకొచ్చాయి. 790mm సీట్ హైట్‌ కల్గి ఉన్నాయి.

    సస్పెన్షన్, బ్రెక్స్, టైర్స్

    ట్రయంప్ స్పీడ్ 400, స్క్రాంబులర్ 400X బైక్స్ ఫ్రంట్ సైడ్‌లో మోనో షాక్ గ్సాస్ సస్పెన్షన్ ప్రీలోడ్ అడ్జెస్టబిలిటీని కలిగి ఉన్నాయి. స్పీడ్ 400 బైక్ బ్యాక్ అండ్ ఫ్రంట్  టైర్స్ 17 ఇంచ్ అలైల్ వీల్స్ కలిగి ఉంటుంది. స్క్రాంబులర్ విషయానికి వచ్చేసరికి  ఫ్రంట్ సైడ్‌లో 19 ఇంచ్ అలైల్ వీల్ ఉంటే వెనుక భాగాన 17 ఇంచ్ అలైల్ వీల్ అమర్చారు. 

    బ్రేకింగ్ సిస్టం చాలా పటిష్టంగా రూపొందించారు.  ట్రయంప్ స్పీడ్ 400 ప్రంట్ సైడ్‌లో 230mm డిస్క్, బ్యాక్ సైడ్‌లో 300mm డిస్క్ సెటప్‌లో వస్తుంది. 400Xలో మాత్రం 320mm ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్‌లతో రానుంది. రెండూ బైక్‌లు కూడా డ్యూయల్ ఛానెల్ ABSను ఆఫర్ చేస్తున్నాయి. 

    అదనపు ఆకర్షణలు

    వీటితో పాటు ఈ రెండు బైకుల్లోనూ రైడ్ బై వైర్, టార్క్ అసిస్ట్ క్లచ్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, హెడ్ మానిటర్‌లో LED లైటింగ్, రైడ్ డేటా, ఫ్యూయేల్ లెవల్, గేర్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా రెండు ఓడోమీటర్లు హెడ్ మానిటర్‌ పక్కన అమర్చబడి ఉంచాయి. సీటైప్ ఛార్జింగ్ పోర్ట్ సౌకర్యం కూడా కలిగి ఉన్నాయి.

    కలర్ ఆప్షన్స్

    ట్రయంప్ స్పీడ్ 400 మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. కాస్పియన్ బ్లూ, పాంథూమ్ బ్లాక్, కార్నివాల్ రెడ్ రంగుల్లో లభించనుంది. ఇక స్క్రాంబులర్ 400X ఖాఖీ గ్రీన్, కార్నివాల్ రెడ్, ఫాంథూమ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది.

    ట్రయంప్ స్పీడ్ 400, స్క్రాంబులర్ 400X ధరలు

    ట్రయంప్ స్పీడ్ 400 బైక్ ఇంట్రడ్యూసరీ ధర రూ.2.23 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ ధర తొలి 10 వేల యూనిట్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. ఆ తర్వాత దీని ఎక్స్‌ షోరూం ప్రైస్ మారనున్నట్లు తెలిపింది. మరో పదిరోజుల్లో వీటిని డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. ఇక స్క్రాంబులర్ 400X ధరను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv