దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో టీవీఎస్ (TVS) ఒకటి. ఈ కంపెనీ తాజాగా సరికొత్త టీవీఎస్ ఎక్స్ (TVS X) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దుబాయ్‌లో నిర్వహించిన కంపెనీ ఈవెంట్లో అట్టహాసంగా ఈ సరికొత్త స్కూటర్‌ను లాంఛ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ. 2.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. గురువారం (ఆగస్టు 24) నుంచే బుకింగ్స్ ఆహ్వానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు డిసెంబర్లో బెంగళూరు సిటీలో స్కూటీలు డెలివరీలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు, ఫీచర్లు, పనితీరు తదితర వివరాలను ఈ కథనంలో చూద్దాం.
పవర్ఫుల్ డిజైన్
TVS X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Xleton ప్లాట్‌ఫామ్ సాంకేతికతతో రూపొందించారు. ఈ స్కూటీ హైస్ట్రెంగ్త్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇది సాధారణ స్కూటర్ల కంటే 2.5 రెట్లు స్ట్రాంగ్‌గా ఉంటుందని సంస్థ పేర్కొంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ఆఫ్సెట్ రియర్ మోనోషాక్ అమర్చారు. TVS X 12 అంగుళాల వీల్స్‌ను కలిగి ఉంది. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ టైర్లు ముందు వైపు 100/80, వెనుక 110/80 కొలతలు కలిగి ఉన్నాయి. బ్రేక్‌లు, డిస్క్‌లు (220mm ముందు, 195mm వెనుక) ABS ఫీచర్‌ను బైక్‌కు అందించారు.
బ్యాటరీ సామర్థ్యం
TVS X స్కూటీ అతిపెద్ద 4.4kWh బ్యాటరీని కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఛార్జ్ పెట్టిన 50 నిమిషాల్లోనే సగం బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందని TVS సంస్థ పేర్కొంది. ఈ స్కూటీ పవర్ అవుట్‌పుట్ 9.3bhp కాగా, గరిష్ట అవుట్‌పుట్ 14.75bhp.
త్రీ రైడింగ్ మోడ్స్
TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. Xtealth, Xtride, Xonic మోడ్‌లను ఇది కలిగి ఉంది. ఈ రైడ్ మోడ్‌లను 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ X టిల్ట్ TFT డిస్ప్లే ద్వారా నియంత్రించవచ్చు. ఈ స్క్రీన్ ద్వారానే గేమింగ్, మ్యూజిక్ సౌకర్యాలను అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇది ద్విచక్ర కనెక్టివిటీని సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది.
ఆధునాతన కంట్రోల్ సిస్టమ్
TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ రీజెనరేషన్, ఇంటెలిజెంట్ క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ హిల్ హోల్డ్ కంట్రోల్‌ను కలిగి ఉంది. అలాగే ప్రమాదాల నియంత్రణకు గాను ఇందులో స్పీడ్ లిమిటర్, క్రాష్ అలర్ట్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్, జియో ఫెన్సింగ్, ఆటో లాకింగ్, టో అండ్ థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు అమర్చారు. ఈ స్కూటీ ద్వారా లైవ్ లొకేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు.
లైటింగ్ వ్యవస్థ
TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో మల్టీ లెడ్ వర్టికల్ హెడ్‌లైట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే టర్నింగ్ ఇండికేటర్లు కూడా ఫిక్స్ చేశారు. వెనుక ఒకే నిలువు బ్రేక్ లైట్, LED టర్న్ ఇండికేటర్లను అమర్చారు.
కలర్ ఆప్షన్స్
TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతానికి రెడ్, సిల్వర్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. బ్రాండ్ తదుపరి దశలో మరిన్ని కలర్స్‌లో స్కూటీలను తీసుకోవాలని టీవీఎస్ భావిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్