• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • UGADI: తెలుగు కొత్తసవంత్సరం ఉగాది… ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

    తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఘనంగా నిర్వహించుకుంటారు. తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు కనుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉగాది పండుగను తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, బెంగాళ్ వంటి రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. కానీ, వీటికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి? అక్కడ ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారనే విషయాలు తెలుసుకుందాం.

    ఉగాది

    ఉగాదిలో యుగం, ఆది అనే పదాలు ఉన్నాయి. యుగ ఆరంభం అవుతుందని దీని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి ( చైత్ర మాసం ) తొలి రోజున నిర్వహించడం ఆనవాయితీ. శాలివాహనుడు అనే చక్రవర్తి  పట్టాభిషిక్తుడై పరాక్రమాలు చూపి యుగకర్తగా బాసిల్లడంతో ఉగాది జరుపుకుంటారని ఇతి వృత్తం. తెలుగు క్యాలెండర్ కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజున ఉగాది జరుపుకుంటారు. 

    ఇంటిని పువ్వులు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించి, రంగురంగుల ముగ్గులు వేసుకుంటారు.  షడ్‌ రుచుల మేళవింపుతో  ఉగాది పచ్చడి చేసుకొని తాగుతారు. పిండివంటలు, భక్షాలు వంటివి తయారు చేసి ఆరగిస్తూ ఇంటిల్లిపాది ఆనందగా గడుపుతారు. పంచాంగ శ్రవణం వింటూ భవిష్యత్తు ఖర్చులు, శుభకార్యాలపై చర్చించుకుంటారు.

    గుడి పడ్వా

    మహారాష్ట్రలోని మరాఠా, కొంకణి హిందువులు ఈ పండుగను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ పండుగను గోవా, మధ్యప్రదేశ్‌, దాద్రా నగర్ హవేలీలోనూ జరుపుకుంటారు. తెలుగువారి మాదిరి మరాఠిలు కూడా చైత్రమాసంలోనే ఉగాది జరుపుకుంటారు. ఈ పండుగను వసంతకాలం, రబీ కోతలకు గుర్తుగా చేస్తారని నానుడి. ఇదే రోజున బ్రహ్మ సృష్టించిన ఆరంభించాడని పురాణాన్ని కూడా నమ్ముతారు ప్రజలు. అయోధ్యలో రావణుడిపై రాముడి విజయం తర్వాత గుడి పడ్వా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందనే ప్రచారం కూడా ఉంది. 

    IMAGE: Wikimedia Commons

    గుడి పడ్వా సాంప్రదాయం

    గుడి పడ్వా రోజున కర్రకు ఓ బట్టను కట్టి దానిని మామిడి, నిమ్మ ఆకులు, పూలతో అలంకరిస్తారు. దీనిపై రాగి లేదా వెండి వంటి కలశాన్ని విజయానికి గుర్తుగా అమరుస్తారు. దీన్ని ఇంటి కిటికీ లేదా భవనంపైన కట్టడం అక్కడ ఆచారం. స్థానికంగా ఉన్న కొంతమంది కలిసి ఈ గుడి కవాద్‌ను రూపొందించి దగ్గర్లోని శివుని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెల్లి వేడుకను జరుపుతారు. మిగిలినవన్నీ తెలుగు రాష్ట్రాల మాదిరిగా నిర్వహిస్తారు. అక్కడ పూరీలు కూడా చేసుకుంటారు. 

    Wikimedia Commons

    పుత్తాండు 

    పుత్తాండు పండుగను పుతువరుదమ్ అని కూడా పిలుస్తారు. తమిళ్ హిందువులు అక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఒకరినొకరు పుత్తాంటు వాల్తుక్కల్‌ అని శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. హ్యాపీ న్యూ ఇయర్‌ అని అర్థం వస్తుంది. ఒక పళ్లెంలో పళ్లు, పూలు వంటివి పెట్టి పూజలు చేసి కుటుంబ సమేతంగా కూర్చొని వెజిటేరియన్ ఫీస్ట్‌ చేసుకుంటారు. 

    Wikimedia Commons

    తమిళనాడులో ఈ పండుగ సమయంలో వివాదం ఉంది. 2008లో అధికారంలో ఉన్న DMK పార్టీ పుత్తాండును జనవరి14న పొంగల్‌తో పాటు నిర్వహించుకోవాలని బిల్‌ పాస్ చేసింది. దీనిని చాలామంది వ్యతిరేకించారు. ఏప్రిల్‌ కాలంలోనే జరుపుకున్నారు. 2011లో ఏఐడీఎంకే పార్టీ అధికారం చేపట్టి వెనక్కి తీసుకున్నారు.

    విషు

    కేరళలో ఉగాదిని విషు పేరుతో జరుపుకుంటారు. మలయాళి క్యాలెండర్‌లో మొదటి మాసం మెటం నెల తొలిరోజున (April 14, 15)  జరుపుకుంటారు. ఈరోజున  శ్రీ మహా విష్ణువు… శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడని ప్రతీతి.  కర్ణాటకలోని తులునాడు  ప్రాంత వాసులు కూడా విషు చేసుకుంటారు. ఇక్కడ ఈ పండుగకి ముందు రోజు టపాసులు కాల్చడం సంప్రదాయం. దీపావళి మాదిరిగా వేడుకను జరుపుతారు ప్రజలు. 

    Wikimedia Commons

    కొత్త సంవత్సరం రోజున ఏది ముందు చూస్తారో అలానే జరుగుతుందనే ఆచారాన్ని నమ్ముతూ ముందురోజున ఒక పళ్లెంలో బియ్యం, నిమ్మకాయ, కొబ్బరికాయ, కొట్టిన కొబ్బరి, జాక్ ఫ్రూట్ వంటివి పెట్టి అలంకరిస్తారు. ఉదయం లేవగానే వాటిని చూడటం అక్కడి సంప్రదాయం. దీనిని విషుఖని అంటారు. సాయంత్రం వివిధ రకాల వంటలు చేసి తింటారు. 

    యుగాది

    తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిని ఎలా జరుపుకుంటారో కర్ణాటకలోనూ అచ్చం అలానే నిర్వహిస్తారు. కానీ, అక్కడ యుగాది అనే పేరుతో పిలుస్తారు. సిక్కులు ఉగాదిని వైశాఖీ పేరుతో, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్‌ అని చేసుకుంటారు. ఆచార వ్యవహారాల్లో కేవలం కొద్దిపాటి మార్పులు మాత్రమే ఉంటాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv