IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీ (Lalit Modi) మళ్లీ ప్రేమలో పడ్డారు. మెున్నటి దాకా బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌తో ప్రేమలో ఉన్న ఆయన ఇటీవల ఆమెకు బ్రేకప్ చెప్పారు. ప్రస్తుతం ఆయన 45 ఏళ్ల ఉజ్వల రౌత్ (Ujjwala Raut)తో డేటింగ్ చేస్తున్నారు.
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వెడ్డింగ్ రిసెప్షన్‌లో లలిత్ – ఉజ్వల్ జంట సందడి చేసింది. లండన్‌లో జరిగిన ఈ వేడుకలో ఆ జోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
లలిత్ – ఉజ్వల్ జంటగా దిగిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఉజ్వల్ రౌత్ ఎవరు? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
1978లో జన్మించిన ఉజ్వల రౌత్.. 90వ దశకంలో భారతీయ ఫ్యాషన్ రంగంలో సత్తా చాటారు. తొలి ఇండియన్ సూపర్ మోడల్ (First Indian Super Model)గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఉజ్వల తండ్రి ముంబై పోలీస్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. ఆమె కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. 17 ఏళ్ల వయసులోనే ఫెమినా మిస్ ఇండియా-1996 పోటీల్లో పాల్గొంది.
ఆ ఈవెంట్‌లో ఆమె ‘ఫెమినా లుక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది. అదే ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఎలైట్ మోడల్ లుక్’ పోటీలో ఆమె టాప్ 15లో చోటు దక్కించుకుంది.
1990వ దశకం చివరి నాటికి, ఉజ్వల దేశంలోని టాప్ మోడల్స్లో ఒకరుగా ఎదిగారు. ఆమె పలు అంతర్జాతీయ డిజైనర్ల లేబుల్స్ కోసం ర్యాంప్ వాక్ చేశారు.
2002, 2003లో వరుసగా ఆమె రెండుసార్లు విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షో కోసం ర్యాంప్ వాక్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మోడల్‌గా రికార్డు సృష్టించింది.
2012లో MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్‌లో మిలింద్ సోమన్‌తో కలిసి న్యాయనిర్ణేతగా కనిపించింది.
ఉజ్వల వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె 2004 జూన్‌లో స్కాటిష్ చిత్ర నిర్మాత మాక్స్ వెల్ స్టెరీని వివాహం చేసుకుంది. పలు సమస్యలతో ఈ జంట 2011లో విడాకులు తీసుకుంది.
ఉజ్వలకు అప్పటికే క్ష (Ksha) అనే కుమార్తె ఉంది. అయితే కూతురు తనకంటే తనకు చెందాలంటూ భార్య భర్తలు కోర్టులో కేసు వేశారు. ఇప్పటికీ ఆ కేసు అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం క్ష ఉజ్వల దగ్గరే పెరుగుతోంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్