• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Upcoming Bikes In December 2023: డిసెంబర్‌లో రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ బైక్స్ ఇవే..!

    భారత్‌లో ద్విచక్రవాహనాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశంలో ఏటా లక్షల్లో బైక్‌లు సేల్‌ అవుతుంటాయి. వాహనదారుల ‌అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ వాహన సంస్థలు ప్రతీ నెల కొత్త మోడళ్లను లాంచ్‌ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే డిసెంబర్‌ నెలలోనూ పలు కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు విడుదల కాబోతున్నాయి. అధునాతన సాంకేతికతతో వీటిని తీసుకువస్తున్నట్లు తయారీ సంస్థలు చెబుతున్నాయి. మరి డిసెంబర్‌లో రానున్న బైక్‌లు ఏవి?. వాటి ప్రత్యేకతలు ఏమిటీ? ఈ కథనంలో తెలుసుకుందాం. 

    Yezdi Roadking

    ఈ పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ డిసెంబర్‌లో లాంచ్‌ కానుంది. BS6 నిబంధలనకు అనుగుణంగా దీనిని తయారు చేశారు. స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీతో పాటు నావిగేషన్‌, USB charging port, డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉండనున్నాయి. దీని ధర రూ.2.60 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. ఈ బైక్‌ ఫీచర్లకు సంబంధించిన మరింత సమాచారం లాంచింగ్‌ రోజున తయారీ సంస్థ ప్రకటించనుంది.

    Royal Enfield Hunter 450

    ఈ బైక్‌ కూడా డిసెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది 450 cc పవర్‌ఫుల్‌ ఇంజిన్‌తో వస్తోంది. లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో రాబోతున్న మెుట్టమెుదటి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ ఇదేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన Himalayan 450 మోడల్‌ కంటే ఇది అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వస్తుందని పేర్కొన్నాయి. దీని ధర రూ.2.70 ఉంటుందని అంచనా. 

    Benelli 752 S

    ఈ శక్తివంతమైన బైక్‌ డిసెంబర్‌లో లాంచ్ కానుంది. ఇది 754 cc bs4 engine ఇంజిన్‌ కలిగి ఉంది.  81.57 PS పవర్‌, 67 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు ముందు, వెనక డిక్స్‌ బ్రేక్స్‌ను అమర్చారు. 15 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ను అందించారు. దీని ధర రూ.6 లక్షల వరకూ ఉంటుందని ఆటోమెుబైల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

    Honda Rebel 1100

    హోండా కంపెనీ నుంచి ఓ స్టన్నింగ్‌ బైక్‌ కూడా డిసెంబర్‌ నెలలోనే మార్కెట్‌లోకి రాబోతోంది. 1084 cc ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌.. 87 PS పవర్‌, 98 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 223 కేజీల బరువుతో పాటు, Double Disc బ్రేక్ సిస్టమ్‌, Tubeless టైర్లతో వస్తుంది. దీని ధర రూ.12 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. 

    Kawasaki Ninja HEV

    ఈ స్టైలిష్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ కూడా డిసెంబర్‌లోనే బైక్ ప్రియులను పలకరించనుంది. W electric motor ఇంజిన్‌తో ఇది రానుంది. ఈ బైక్‌.. ముందు వెనక డిస్క్‌ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ట్యూబ్‌ లెస్‌ టైర్లతో రానుంది. దీని ధర రూ. 8 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. 

    Honda CL500 Scrambler

    471 cc ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌.. 46.2 PS పవర్‌, 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 26.5 kmpl మైలేజ్‌ను అందిస్తుంది. 191 kg కిలోల బరువున్న ఈ హోండ్‌ బైక్‌కు Double Disc బ్రేకులను అందించారు. ఇది కూడా డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ ధర రూ. 6 లక్షల వరకూ ఉండొచ్చని తెలిసింది. 

    Aprilia RS 457

    ఈ Aprilia బైక్‌ 457 cc ఇంజిన్‌తో రాబోతుంది. ఇది 48.6 PS పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్‌ను డ్యూయల్‌ డిస్క్‌ బ్రేక్, ట్యూబ్‌లెస్‌ టైర్లు, డ్యూయల్‌ ABS Channel వంటి ఫీచర్లతో తీసుకొస్తున్నారు. దీని ధర రూ. 4.25 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv