భారత్‌లో యామా క్రేజ్ ఉన్న రంగాల్లో వాహన రంగం ఒకటి. ఇక్కడ ఏటా లక్షల్లో బైక్‌లు సేల్ అవుతూ ఉంటాయి. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా వాహన సంస్థలు ప్రతీ ఏడాది కొత్త మోడళ్లను తీసుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో పలు కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు విడుదల కానున్నాయి. అధునాతన సాంకేతికతతో వీటిని తీసుకువస్తున్నట్లు ఆయా సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇంతకీ వచ్చే నెలలో రాబోయే బైక్‌లు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Royal Enfield Himalayan 450
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన హిమాలయన్ 450 బైక్.. నవంబర్ 1న లాంచ్ కానున్నట్లు ఆటోమెుబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బైక్ ధర రూ. 2.7 – 2.8 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇది 450 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూలింగ్ ఇంజన్‌తో రానుంది. ఇలా లిక్విడ్ కూలింగ్ ఇంజిన్‌తో రాబోతున్న తొలి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇదే కావడం విశేషం.
CFMoto 300SR
ఈ బైక్ కూడా వచ్చే నెలలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.3 – 3.5 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. నవంబర్ 9న ఈ బైక్ రిలీజయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ బైక్ 292 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రానుంది. Suzuki Gixxer SF250, KTM RC, TVS Apache RR 310 బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
BMW CE 02 Electric
BMW నుంచి పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ నవంబర్‌లో భారత్‌లోకి రానుంది. వచ్చే నెల 16వ తేదీన ఈ బైక్ లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 7-8 లక్షలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం లాంచింగ్ రోజున వెల్లడి కానుంది.
TVS Zeppelin
టీవీఎస్‌కు చెందిన ఈ Zeppelin బైక్.. నవంబర్ 17న రిలీజయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 2 – 3.2 లక్షల వరకూ ఉండొచ్చని ఆటోమెుబైల్ వర్గాలు భావిస్తున్నాయి. 220 cc పవర్‌ఫుల్ ఇంజిన్‌తో ఈ బైక్ రోడ్లపై చక్కర్లు కొట్టనుంది. యూత్‌ను ఆకర్షించే ఎన్నో ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.
Suzuki V-Strom 800DE
నవంబర్‌లో సుజూకి నుంచి పవర్‌ఫుల్ బైక్ లాంచ్ కానుంది. ఇది 776 cc ఇంజిన్‌తో రాబోతోంది. 20 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, సిక్స్ స్పీడ్ గేర్ల బాక్స్, 22.7kmpl మైలేజ్ వంటి ఫీచర్లను ఈ బైక్‌కు అందించినట్లు తెలిస్తోంది. దీని ధర రూ. 11-12లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
Suzuki GSX-8S
సుజూకి నుంచి GSX-8S మోడల్ బైక్ కూడా నవంబర్‌లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ బైక్ ధర రూ.10 – 11 లక్షలు ఉండొచ్చని తెలిసింది. ఈ స్పోర్ట్స్ బైక్ 776cc parallel twin motor ఇంజిన్‌తో రానుంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!