దేశంలో గత కొన్నేళ్లుగా SUV (Sport Utility Vehicle) కార్లకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు SUVలను ఉత్పత్తి చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్తగా మరో మూడు SUV కార్లు త్వరలో భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. హుండాయ్, కియా, హోండా కంపెనీలు తమ నయా SUVలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్ల ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
Hyundai Exter
హ్యుందాయ్ (Hyundai) కంపెనీకి చెందిన ఈ కారు త్వరలోనే భారత్‌లో లాంచ్ కానుంది. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇది 84 PS పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది వస్తుంది. ఫ్యాక్టరీ ఫిట్టెట్ సీఎన్‌జీ కిట్‌ను కూడా కారుతో పాటు అందిస్తారు. ఈ కారు లీటర్‌కు 19.2 km మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ SUV కారు ధర సుమారు రూ.6 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.
Honda Elevate
హోండా ఎలివేట్ SUV కారులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 121 పీఎస్ పవర్‌ను, 145ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. అలాగే 16 ఇంచ్ డైమెండ్ కట్ డిజైనర్ అలాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, 5 సీటర్ కేబిన్‌లో సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టెమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.11-16.20 లక్షల మధ్య ఉండనుంది.
Kia Seltos Facelift
ఈ కియా కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రాబోతోంది. ఇది 160 PS పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. six speed iMT లేదా seven speed DCT గేర్ బాక్స్ ఉండనుంది. అలాగే ఈ కారులో ఇన్ఫోటైన్‌మెంట్ కోసం HD టచ్‌స్క్రీన్‌ను అందించారు. ఇది ప్రీమియం ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. కారు క్యాబిన్ డ్యూయల్ జోన్ పుల్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.89 లక్షల వరకూ ఉండనుంది.