• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VD 12: శ్రీలంకలో చిల్ అవుతున్న విజయ్‌ దేవరకొండ.. బోట్‌ నడుపుతున్న వీడియో వైరల్‌! 

    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్‌ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూట్‌ శ్రీలంకలో జరుగుతుండగా అక్కడ విజయ్‌ చిల్ అవుతున్నాడు. 

    బోట్‌ నడుపుతూ విజయ్‌ చిల్‌!

    విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘VD 12’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శ్రీలంకలో శరవేగంగా సాగుతోంది. విజయ్ సరికొత్త లుక్‌లో ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అదే సమయంలో షూటింగ్‌ గ్యాప్‌లో తెగ చిల్‌ అవుతున్నాడు. నీటిలో బోట్‌ రైడ్‌ చేస్తూ విజయ్‌ ఎంజాయ్‌ చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సూర్యస్తమయ సమయంలో బోట్‌ రైడ్‌ చేస్తున్న వీడియోను విజయ్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. బోట్ డ్రైవింగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. 

    రెండు భాగాలుగా..

    ‘VD 12’ చిత్రానికి సంబంధించి ఇటీవల నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్‌ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్‌ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్‌ తెరకెక్కిస్తాం. గౌతమ్‌ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్‌ హిట్‌ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్‌ చేసిన చిత్రాలన్నీ సింగిల్‌ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్‌ కెరీర్‌లోనూ సీక్వెల్స్‌ చూసే అవకాశం లభించనుంది.

    పవన్‌తో పోటీ!

    సోమవారం (సెప్టెంబర్‌ 23) హరి హర వీర మల్లు రిలీజ్‌ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్‌ వద్ద పవన్‌, విజయ్‌ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్‌ నటిస్తున్న ‘VD 12’ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పవన్‌ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్‌ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు ‘VD 12’ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌!

    ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. పీరియాడికల్‌ జానర్‌లో రాయల సీమ బ్రాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv