గత రెండేళ్లుగా విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్‌ను తిరిగి వెండి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా విజయ్ 2020లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే 2021లో జాతిరత్నాలు సినిమాలో ఓసారి తళుక్కున మెరిశాడు విజయ్. ఆ తర్వాత రెండేళ్లుగా విజయ్ కేవలం లైగర్ సినిమాతోనే బిజీగా ఉన్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న పాన్ ఇండయా మూవీ లైగర్. సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమాలకు షూటింగ్ త్వరగా పూర్తి చేస్తాడు. కానీ కరోనా రెండు సార్లు షూటింగ్‌కి అడ్డుకట్ట వేయడంతో ఇంత ఆలస్యం జరిగింది. దీంతో పాటు పూరి, మొదటిసారిగా పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం కూడా దీనికి ఒక కారణం.
ఎన్నో అంచనాలతో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయింది. దీంతో ఇదే నా చివరి లవ్ స్టోరీ. ఇకపై ఇలాంటి సినిమాలు చేయను అనే స్టేట్‌మెంట్ ఇచ్చాడు రౌడీ హీరో. ఇంత తక్కువ కెరీర్‌లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. అయితే ఇప్పుడు అందుకు తగ్గట్లుగానే పూర్తి విభిన్నమైన కథతో బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్లు అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతుండటంతో ఆగస్ట్ 25, 2022న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు.
మొదటిసారిగా విజయ్ దేవరకొండ ఈ సినిమలో సిక్స్ ప్యాక్‌తో వైల్డ్ లుక్‌తో కనిపిస్తున్నాడు. సినిమా కోసం చాలా కష్టపడి పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది. చిత్రం విజయంపై హీరోతో పాటు చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉన్నారు. మొదటి సారిగా తమ అభిమాన హీరోను ఇలాంటి పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్‌లో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. మొట్ట మొదటిసారిగా ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ సినిమాలో అది కూడా ఒక తెలుగు సినిమాలో నటిస్తుండటం ప్రత్యేకమైన విషయం. టైసన్‌తో చిత్ర బృందం దిగిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సినిమాపై సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ రూ.65 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. లైగర్‌ను నేరుగా థియేటర్లో విడుదల చేసేందుకు కూడా భారీ ఆఫర్లు వచ్చాయట. కానీ ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు దాన్ని తిరస్కరించారు.లైగర్ కోసం చాలా సమయం కేటాయించడంతో తర్వాత సినిమాలను వేగంగా పట్టాలకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు విజయ్. సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తుండగా, శివ నిర్వాణ తర్వాత వరుసలో ఉన్నాడు. మళ్లీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన అనే మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. దీంతో విజయ్ కెరీర్ వేగం పుంజుకుంటుదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి