సాయి ధరమ్ తేజ్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న అనంతరం చేసిన మెుదటి సినిమా విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. యాక్సిడెంట్ తర్వాత మాట కూడా పడిపోయిందని చెప్పిన సాయి… సినిమాలో ఎలా నటించాడు? సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న మరో దర్శకుడు సక్సెస్ అయ్యాడా ? లేదా ? సుకుమార్ స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం
దర్శకుడు: కార్తీక్ దండు
నటీ నటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సోనియా సింగ్, రవికృష్ణ
సంగీతం: అజనీశ్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్
కథ
రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
ఎలా ఉందంటే?
రుద్రవరం అనే ఊరికి ఓ జంట శాపం పెట్టడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సూర్య పాత్రలో సాయిధరమ్, నందినీగా సంయుక్త మీనన్ నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సీన్లు ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గానే అనిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్‌కు ముందు అసలు కథను ప్రారంభించి అదిరిపోయే సన్నివేశాలు పెట్టడంతో సెకాండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది.
ఊరిలో ఒక్కొక్కరు చనిపోతుంటే దాని వెనుకున్న రహస్యాన్ని చేధించే అంశాలతో సెకాండాఫ్‌ను నింపేశారు. కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్ని కచ్చితంగా సీటు అంచుల్లో కూర్చొబెడుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు చిత్రం బాగానే ఉంటుంది. చివర్లో కాస్త తడబడ్డారనే చెప్పాలి.
ఎవరెలా చేశారు?
సాయిధరమ్ తేజ్‌కి ఇది కమ్ బ్యాక్ సినిమా. నటనలో మరో మెట్టు ఎక్కేశాడు కుర్ర హీరో. సూర్య పాత్రలో లీనమైపోయాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు సాయి. సంయుక్త మీనన్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ హీరోయిన్ మరోసారి మెప్పించిందనే చెప్పాలి. తన ఖాతాలో మరో హిట్ వేసుకుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సోనియా సింగ్, అజయ్ లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక పనితీరు
సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకుడు కార్తీక్ దండు మెుదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్ ఓదెల ఎలా ఆకట్టుకున్నారో కార్తీక్ కూడా అదేస్థాయిలో మెప్పించాడు. విరూపాక్ష చిత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కార్తీక్. ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే. సుకుమార్ స్వయంగా అందించిన స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. చిత్రాన్ని ఎక్కడో నెలబెట్టింది.
విరూపాక్ష చిత్రానికి సంగీతంతో ప్రాణం పోశాడు అజనీశ్ లోక్‌నాథ్. కాంతార చిత్రానికి మ్యూజిక్ అందించి మెప్పించిన అతడు.. విరూపాక్షలో అందించిన నేపథ్య సంగీతం పెద్ద అసెట్. చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.
బలాలు
కథ, కథనం
సాయిధరమ్, సంయుక్త మీనన్
నేపథ్య సంగీతం
బలహీనతలు
క్లైమాక్స్, లవ్ ట్రాక్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!