నిశ్శబ్దంగా ఉన్న అగ్నిపర్వతం లావాలో ఓ మనిషి శరీరం పడితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ [వీడియో](url) చూడండి. ఈ వీడియోలో నిజంగానే మనిషిని లావాలో విసిరేసారనుకునే సుమా! మనిషి శరీర తత్వానికి సరిపోయే 30 కిలోల ఆర్గానిక్ వేస్ట్‌ను ఈ ప్రయోగానికి ఉపయోగించారు. ఈ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇథియోపియాలోని యాక్టివ్ వొల్కానో ‘ఎర్తా ఏల్’ వద్ద ఈ ప్రయోగం చేశారు.