డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబోలో ‘లైగర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం విధితమే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన పూరీ ఈ సినిమాను భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. బాక్సింగ్ కథాంశంతో సాగే ఈ మూవీలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తొలిసారి నటించడం విశేషం. ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించని ఈ దిగ్గజ ఆటగాడు ఉన్నట్టుండి ఒక ఇండియా సినిమాలో నటించడంతో అతడి రెమ్యూనిరేషన్ ఎంత ఉంటుందా..? అని సినీ వర్గాల్లో చర్చలు నడుస్తుంది.
ఎంత ఉంటుందంటే..
ఏదైనా ప్రత్యేక షోలకు వెళ్తేనే కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే టైసన్ ఈ సినిమాలో ఏకంగా ఓ పాత్రనే పోషిస్తున్నాడంటే గట్టిగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో.. టైసన్‌కి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య ఇస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ- మైక్ టైసన్ మధ్య కొన్ని ఫైటింగ్ సీన్లు కూడ ఉంటాయట.
రిలీజ్ డేట్ ఫిక్స్
అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2022, ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. టైసన్ లాంటి అంతర్జాతీయ ఆటగాడు ఈ సినిమాలో నటిస్తుండటంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. పూరి మార్క్ డైరెక్షన్ ఈ సినిమా ద్వారా మనకు ఇంకోసారి పరిచయం అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి