కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- వెస్డిండీస్ మధ్య నేడు రెండో టీ20 జరుగనుంది. వన్డే సిరీస్‌తో పాటు, మొదటి టీ20లో కూడ గెలుపొంది టీమిండియా ఉత్సాహంతో ఉండగా.. కనీసం టీ20 సిరీస్ అయిన దక్కించుకోవాలని కరీబియన్లు భావిస్తున్నారు. నిర్ణయాత్మకంగా మారిన సెకండ్ టీ20లో విజయం ఎవరిని వరిస్తుందో? ఇలా అంచనా వేయోచ్చు.
టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే!
కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలమైన పిచ్ కలిగి ఉంది. ఈ పిచ్‌పై స్పీడ్ బౌలర్ల కంటే స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫస్ట్ టీ20లో భారత్ తరఫున రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీసి 17 పరుగులే ఇవ్వగా, వెస్టిండీస్ తరఫున రోస్టన్ చేజ్ 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అందుకే భారత్ టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పిచ్‌లో ఛేజింగ్ టీమ్ 6 సార్లు గెలవగా 3 సార్లు మాత్రమే ఓడిపోయింది. కాబట్టి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే సగం మ్యాచ్ గెలిచినట్టేగా భావిస్తున్నారు క్రికెట్ నిపుణులు. రెండో టీ20లో ఎవరు టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే పిచ్ ఛేజింగ్‌కి చాలా అనుకూలంగా ఉంది.
భారత్-వెస్టిండీస్ మధ్య గెలుపొటముల రికార్డు
ఇప్పటి వరకు భారత్- వెస్టిండీస్‌ల మధ్య 18 టీ20లు జరగగా 11 సార్లు భారత్, 6 సార్లు వెస్టిండీస్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ రికార్డును బట్టి చూస్తే విజయ అవకాశాలు ఎక్కువగా భారత్‌కే ఉన్నాయని చెప్పొచ్చు.
జట్ల అంచనా
రెండు జట్ల తరఫున ఫస్ట్ టీ20 ఆడిన ప్లేయర్లే రెండో టీ20 ఆడే అవకాశం ఉంది. ఈ రోజు ఫలితాలను బట్టి మూడో టీ20 జట్టుల్లో మార్పులు చేర్పులు జరిగే ఛాన్సులు ఉన్నాయి.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
వెస్టిండీస్: కీరన్ పొలార్డ్(కెప్టెన్), నికోలస్ పూరన్(కీపర్), రోవ్మాన్ పావెల్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, రోస్టన్ చేజ్, రోమారియో షెపర్డ్, షెల్డన్ కాట్రెల్, ఫాబియన్ అలెన్, అకేల్ హోసెన్, ఓడియన్ స్మిత్
ఈ ముగ్గురు రాణించే అవకాశం ఉంది
భారత్ తరఫున రెండో టీ20లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. ఫస్ట్ టీ20లో రోహిత్ కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. అలాగే సూర్యకుమార్ 81 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ పిచ్‌ని అర్థం చేసుకున్న అనుభవంతో మరో భారీ స్కోరును వీరు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే ఈడెన్ గార్డెన్స్ స్పిన్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉంది. రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్‌లో కూడ కీలక వికెట్లు పడగొట్టే ఛాన్స్ ఉంది. ఇతను ఫస్ట్ టీ20లో 4 ఓవర్లు వేసి 17 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ టైమింగ్స్
రెండో టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభంకానుంది. మ్యాచ్ లైవ్‌ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లేదా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో వీక్షించొచ్చు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!