[VIDEO](url): భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. తొలి స్పెల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ.. రెండో స్పెల్ మూడో బంతికే వికెట్ పడగొట్టాడు. లబుషేన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 72 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. షమీ వికెట్ తీసిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆఫ్‌సైడ్ బంతిని ఆడే క్రమంలో బ్యాట్ ఎడ్జ్ తీసుకోని లబుషేన్ బౌల్డయ్యాడు.