ఈరోజుల్లో యువత సరికొత్త పరిచయాల కోసం ఆరాటపడుతోంది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లోనే ప్రేమించుకొని, పెళ్లి చేసుకునే రోజులు వచ్చాయి. ఇలాంటి సమయంలో యువత రిలేషన్ షిప్‌ను ఏర్పరుచుకునేందుకు డేటింగ్ యాప్స్ వైపు మెుగ్గు చూపుతోంది. కానీ, ఇటీవల దిల్లీ లాంటి ఉదంతాలతో జంకుతోంది. ఇండియాలో చాలా డేటింగ్ యాప్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
డేటింగ్ యాప్స్‌లో సాధారణ పరిచయాలైనా, ప్రేమ, స్నేహ బంధాలకైనా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో సరైన యాప్‌ను ఎంచుకోవటం ప్రస్తుతం సవాలుగా మారింది. డేటింగ్ యాప్స్ రేటింగ్స్, ఉపయోగించే తీరు, రోజుకు జరిగే మ్యాచెస్ వంటి అంశాల ఆధారంగా మేము కొన్ని డేటింగ్ యాప్స్ సమీక్షించాం. ప్రస్తుతం టాప్-5 ట్రెండింగ్‌లో ఉన్న డేటింగ్ యాప్స్ మీకోసం అందిస్తున్నాం.
దేశంలోని టాప్ 5 డేటింగ్ యాప్‌ల సమీక్ష
1. టిండర్(Tinder)
మార్కెట్ లో ప్రస్తుతం పేరుపొందిన డేటింగ్ యాప్స్ లో టిండర్ ఒకటి. దీనిని ఉపయోగించడం చాలా సులభం. మనం ఉన్న ప్రాంతంలో లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా పరిచయం ఏర్పరుచుకోవచ్చు. కానీ, కొద్దిమందితో మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువమందిని చూడాలనుకుంటే మాత్రం టిండర్ ప్లస్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇందులో కొన్ని సౌకర్యాలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
2. బంబుల్(Bumble)
బంబుల్ డేటింగ్ యాప్ పూర్తిగా మహిళల సౌకర్యార్థం తీసుకువచ్చింది. ఇందులో అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలను సంప్రదించే అవకాశం ఉంటుంది. అనవసరమైన వేధింపుల నుంచి యువతులు తప్పించుకునే అవకాశం ఉంది. కానీ, ఇటీవల దిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో వారిద్దరు ఇదే డేటింగ్ యాప్ లో కలుసుకున్నారు. మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఆమెను 35 ముక్కలుగా నరికి ఆఫ్తాబ్ హత్య చేశాడు.
3. హింజ్( Hinge)
హింజ్ డేటింగ్ యాప్ దాదాపు టిండర్ ను పోలి ఉంటుంది . కానీ, కొన్ని అదనపు ఫీచర్స్ తీసుకువచ్చారు. మన ఫేస్ బుక్ స్నేహితుల డాటాను వెతికి దాని ద్వారా పరిచయాలను చూపిస్తోంది. ఇష్టమున్న వ్యక్తులతో తరచుగా ఎంతసేపు మాట్లాడుతున్నారో తెలియజేస్తుంది. అంతేకాదు, సంభాషణలు ప్రారంభించడానికి ప్రాంప్ట్ అందిస్తోంది. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం.
4. ఓకే క్యూపిడ్
ఓకే క్యూపిడ్ ఉచిత డేటింగ్ యాప్. ఇది వినియోగిస్తున్నందుకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవరసం లేదు. దీన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. కచ్చితమైన మ్యాచ్ లను అందించేలా రూపొందించారు.
5. క్వాక్- క్వాక్
ముఖ్యంగా భారతీయులను దృష్టిలో పెట్టుకుని ఈ డేటింగ్ యాప్ తీసుకొచ్చారు. ఒకే రకమైన అభిరుచులు ఉన్నవారి మధ్య స్నేహాన్ని ప్రొత్సహిస్తుంది. వారి చాటింగ్, సంభాషణలను అత్యంత గోప్యంగా ఉంచుతుంది.
చివరగా..
దేశంలో డేటింగ్ యాప్స్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో సరైన యాప్ ను ఎంచుకోకపోతే మహిళలకు వేధింపులు తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు అవి తీవ్ర పరిణామాలకు దారితీసతీస్తున్నాయి. ఈ క్రమంలో డేటింగ్ యాప్ ఎలాంటిదైనా దానిని ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం