తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో…! సింపుల్ స్టోరీ లైన్… ! చివర్లో చిన్న ట్విస్ట్…! కానీ, ఇందులో పాత్రలు మాట్లాడాయి. డైలాగులు గుర్తిండిపోయేలా పేలాయి. పాటలు మార్మోగాయి. ఇన్నీ జరిగాయి కనుకే ఇండస్ట్రీ హిట్ అనే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు ఆ సినిమా కలెక్షన్లను కొట్టే చిత్రమే రాలేదంటే నమ్ముతారా? ఏం సినిమా అనుకుంటున్నారా ! మహేశ్ బాబు నటించిన “పోకిరి”. చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో మరొక్కసారి అలా ఓసారి సినిమాను గుర్తు చేసుకుందాం.
మాస్ టచ్
“ గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్ 200 సెంటర్స్ 100 డేస్”. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే మాట ఇది. లేకపోతే మహేశ్ బాబు లాంటి హీరోను పెట్టి “పోకిరి” అనే టైటిల్ పెట్టి ఏకంగా రికార్డులు తిరగరాశాడంటే పూరి జగన్నాథ్ గట్స్‌ను మెచ్చుకోవాలా? వద్దా?. మాస్ ఆడియన్స్ మెుత్తం థియేటర్లకు క్యూ కట్టారంటే టైటిల్ వల్లే కదా.
స్టైల్ సాలా
సినిమాలో హీరో ఓ గ్యాంగ్‌స్టర్. డిఫరెంట్‌గా కనిపించాలి కదా మరి. అందుకే ఇద్దరూ కలిసి అలా కాసేపు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. ఏంటంటే? షర్ట్ మీద షర్ట్ వేసేద్దాం గురూ అని. ఇంకేముంది అదో ట్రెండ్ సెట్ అయ్యింది.
మాటల తూటాలు
పూరీ జగన్నాథ్ అంటే మాస్ డైలాగులే. పోకిరి చిత్రంలో వాటికి కొదవ లేదు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఇలా పవర్ ప్యాక్డ్ డైలాగులు ఒక్కటేమిటీ బోలేడున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యాయి.
స్వాగ్ సాంగ్స్
పోకిరి సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డోలే డోలే దిల్ జర జర అంటూ మహేశ్ కుర్చీలో కూర్చొని వేసిన ఓ స్వాగ్ స్టెప్ ఎవరైనా మర్చిపోతారా? అంతేనా..ఇందులో ఉన్న 6 పాటలు సూపర్ హిట్టే.
కృష్ణమనోహర్ IPS
గ్యాంగ్‌స్టర్ పండుగాడు శత్రువులపై బుల్లెట్స్ వర్షం కురిపించి ఒక్కసారిగా కృష్ణ మనోహర్ IPSగా పోలీస్ గెటప్‌లో కనిపిస్తే ఆ సీన్ గుర్తొస్తేనే గూస్‌బంప్స్ వస్తాయి కదా ! పూరీ మార్క్ మరి ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది.
ఇండస్ట్రీ హిట్
సినిమా తీశాక ఇందులో ఏముంది అనుకున్నారంటా? అస్సలు ఆడదని కొందరు చెప్పారంటా? ఒక్కసారి విడుదలయ్యాక వాళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. దెబ్బకి కొడితే ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ పదాన్ని అప్పుడే సృష్టించారంటే నమ్మండి. పక్కా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన మాటలు, పాటలు అన్నీ ఉన్నాయి కనుకే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. ఏకంగా రూ. 66 కోట్లు వసూలు చేసింది. అప్పుడు రూ 66 కోట్లు అంటే ఇప్పుడు రూ. 1000 కోట్లకు సమానమే అవుతుంది కదా. రీరిలీజ్‌లోనూ పోకిరి చిత్రం రూ. 1.7 కోట్లు వసూలు చేసింది.
ఎందరిని దాటుకుని మహేశ్ దగ్గరికి వచ్చిందో తెలుసా?
పూరి సినిమా తీస్తున్నాడంటే మూడు నెలల్లో అయిపోవాల్సిందే. అస్సలు సమయం వృథా చేయడు. ఓ హీరోకి కథ చెప్పి ఎక్కువ ఆలస్యం అవుతుందనిపిస్తే ఇంకో హీరోతో తీసేస్తాడంతే. పోకిరి కూడా మహేశ్‌బాబుకి అలా వచ్చిందే. సినిమా స్టోరీని మెుదట పవన్ కల్యాణ్‌కు చెప్పాడు పూరీ. కానీ, పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత రవితేజకు వినిపించాడు. ఓకే చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అనంతరం సోనూసూద్‌ని పెట్టి తీసేద్దాం అనుకున్నాడట. ఇది కూడా మూలన పడింది. తర్వాత మహేశ్ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.
పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్
పోకిిరి సినిమాకు ముందు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ పెట్టాడు జగన్. కానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాలని సూచించాడు మహేశ్. దానికి ఒప్పుకున్న పూరి పోకిరి అనే ఖరారు చేశాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!