త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా 2020లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘అల వైకుంఠపురములో’. ‘స్టైల్‌గా ఉంది కదా నాకు కూడా నచ్చింది’ అంటూ అల్లు అర్జున్ చేసిన సందడి ఇప్పటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తుంది. పూజా హెగ్డే కూడా ‘మేడం సార్ మేడం అంతే’ అంటూ సినిమాలో చించేసింది. సుశాంత్, నవదీప్, నివేథా పేతురేజ్ సపోర్టింగ్ రోల్స్‌లో ఇరగదీశారు. త్రివిక్రమ్ డైలాగ్స్, బ్రహ్మాజీ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ, థమన్ మ్యూజిక్, సముద్ర ఖని నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
2020లో వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుింది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అల్లు అర్జున్, థమన్, త్రివిక్రమ్, పూజా హెగ్డే అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా నాటి ఫోటోలను పోస్ట్ చేస్తూ సినిమాపై తమకున్న ఎమోషన్‌ను పంచుకున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది.
సినిమా షూటింగ్లో మేకప్ వేస్తున్నప్పుడు అల్లుఅర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హతో డ్యాన్స్ చేసిన వీడియోను పంచుకుంది. ముద్దు ముద్దు హావభావాలతో ‘బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ’ అంటూ వీళ్ళు చేసిన అల్లరి అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టుకు అల్లు అర్జున్, నేను కలిసి చేసిన డ్యాన్స్‌ను మీరు చూశారు, కానీ నేను అర్హ చేసిన వీడియో మీరు చూసి ఉండరు అంటూ క్యాప్షన్ జోడించింది. కాగా ఈ మధ్య పూజా హెగ్డే, అల్లు అర్జున్ నటించిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్