సెలెబ్రిటీలు ఏం చేసినా వెంటనే ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. వారు చేసే రీల్స్, ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా తమ తమ రీల్స్‌ను పోస్ట్ చేస్తూ తమ అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ జాబితాలో బిగ్‌బాస్ 4వ సీజన్ కంటెస్టెంట్ అశు రెడ్డి, అరియానా గ్లోరీ ముందుంటారు. వీళ్ళు చేసే ఫోటో షూట్లు, రీల్స్‌లు ట్రేండింగ్లో నిలుస్తాయి. వీళ్ళు చేసే డాన్స్, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ట్రోల్ అవుతూ ఉంటాయి కూడా.
బిగ్‌బాస్ 4వ సీజన్ లో బోల్డ్ లేడీగా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సాధించిన యాంకర్ అరియనా గ్లోరీ. తనతో పాటు వచ్చిన కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చి తనేంటో నిరూపించుకుంది. తన ఆటతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఇంటర్వ్యూలు చేస్తుంది. ఏ సినిమా వచ్చినా అరియానా ఇంటర్వ్యూ ఉండాల్సిందే అన్నట్టుగా క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఫన్నీ ఫన్నీ మాటలు, సూటి ప్రశ్నలు ఈ అమ్మడి ఇంటర్వ్యూలలో స్పెషల్ అట్రాక్షన్
అయితే ఈ మధ్య అరియనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఈమె చేస్తున్న రీల్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఒక రీల్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాటకు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ… అరియానా చేసిన రీల్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రెడ్ డ్రెస్‌లో తమిళ పాటకు అలా నడుస్తూ.. గోడ చాటున దాక్కుంటూ అరియనా చేసిన రీల్ అద్భుతంగా ఉంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్