మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి వసూళ్లనే సాధించి రవితేజ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది.
తొలి కలెక్షన్స్ ఎంతంటే?
తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు ప్రదర్శించింది. యూఎస్ మార్కెట్లోనూ మంచి వసూళ్లను సాధించింది. మెుదటి రోజున వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.11.90 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. దీంతో రవితేజ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ‘ఈగల్’ నిలిచింది. అలాగే ఈ వీకెండ్లో కూడా ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే బాక్సాఫీస్ వద్ద ఈగల్‌కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించారు.
రవితేజ టాప్-10 కలెక్షన్స్! (Ravi Teja Top 10 Highest Grossing Movies)
‘ఈగల్’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. దీంతో రవితేజ కెరీర్లో ఈ చిత్రం హెయెస్ట్ గ్రాసర్‌గా నిలవనుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
ధమాకా (Dhamaka)
రవితేజ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.35 కోట్లు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్‌గా రూ.84.7 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.44.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్ల వరకూ జరిగింది.
బడ్జెట్: 35 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 84.7cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 44.5cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 20 కోట్లు
క్రాక్ (Krack)
ధమాకా తర్వాత రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘క్రాక్’ నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.70.6 కోట్ల గ్రాస్, రూ. 39.4 షేర్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18 కోట్లకు జరగడం గమనార్హం. క్రాక్ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 70.6cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 39.4cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 18 కోట్లు
తీర్పు: బ్లాక్ బస్టర్
రాజా ది గ్రేట్ (Raja the Great)
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.31.6 కోట్ల షేర్‌ను నిర్మాతలకు అందించింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ.30 కోట్లు బడ్జెట్ కాగా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే ఆ మెుత్తాన్ని రాబట్టడం విశేషం.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 52cr
వరల్డ్ వైడ్ షేర్ : 31.6cr
ప్రీ-రిలీజ్ బిజినెస్: 30 కోట్లు
తీర్పు: హిట్
బలుపు (BALUPU)
రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50.1 కోట్లు కొల్లగొట్టుంది. రూ.28 కోట్ల షేర్‌ను రాబట్టింది. గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ.15 కోట్లకు చేసుకుంది.
బడ్జెట్: 25 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 50.1cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 28cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 15 కోట్లు
టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)
రవితేజ గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను రాబట్టింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా రూ.48.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.25.7 షేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.38 కోట్లకు జరగడం గమనార్హం. కాగా, ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ నాయుడు (Vamsi Krishna Naidu) డైరెక్ట్ చేశారు.
బడ్జెట్: 55 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 48.8cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 25.7cr
ప్రీ-రిలీజ్ బిజినెస్: 38 కోట్లు
పవర్ (Power)
రవితేజ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన మరో చిత్రం ‘పవర్’. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లు వసూలు చేసింది. 24.1 కోట్ల షేర్.. రూ.25 కోట్ల ప్రీరిలీజ్ గణాంకాలను నమోదు చేసింది.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 45cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 24.1cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 25 కోట్లు
తీర్పు: సగటు కంటే ఎక్కువ
బెంగాల్ టైగర్ (Bengal Tiger)
ఈ సినిమా బడ్జెట్ రూ. 25 కోట్లు. ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ. 23 కోట్లకు చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 38 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.21.8 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna Bhatia), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు.
బడ్జెట్: 25 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 38cr
వరల్డ్ వైడ్ షేర్ : 21.8cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 23 కోట్లు
విక్రమార్కుడు (Vikramarkudu)
దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) డైరెక్షన్లో రవితేజ చేసిన సూపర్ హిట్ మూవీ విక్రమార్కుడు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.37.8 కోట్లు రాబట్టింది. అలాగే రూ.18.9 షేర్‌ను సాధించింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.11.5 కోట్లకు జరగడం విశేషం.
బడ్జెట్: 11 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 37.8cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 18.9cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 11.5 కోట్లు
కిక్ (Kick)
రవితేజ చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్’ కచ్చితంగా ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ.14 కోట్లు కాగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అంతకే జరగడం గమనార్హం.
బడ్జెట్: 14 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 36cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 22.7cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 14 కోట్లు
కిక్ (KICK 2)
అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ చిత్రాల జాబితాలో ‘కిక్ 2’ ప్రస్తుతం పదో స్థానంలో నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.25 కోట్ల షేర్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రిరీలిజ్ బిజినెస్ రూ.36 కోట్లు. కిక్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
బడ్జెట్: 30Cr
ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 43cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 25cr
ప్రీ రిలీజ్ బిజినెస్: 36Cr
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్