యానిమల్’ (Animal) చిత్రంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్ ప్రియులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్ పార్క్’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
విలన్‌గా స్టార్ హీరో!
‘యానిమల్ పార్క్’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్ క్లైమాక్స్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. షారుక్ ఖాన్ ‘డంకీ’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన ‘విక్కీ కౌశల్’ (Vicky Kaushal).. యానిమల్ పార్క్‌లో మెయిన్ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్ వర్సెస్ విక్కీ కౌశల్ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
‘యానిమల్ పార్క్’ ఇప్పట్లో లేనట్లే!
‘యానిమల్’ సినిమా దెబ్బకు దేశంలోని టాప్ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే సందీప్ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్.. యానిమల్ పార్క్ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.
యానిమల్ సీక్వెల్ లక్ష్యమదే!
గతంలో ‘యానిమల్’ సీక్వెల్ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్ పార్క్’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.
‘విక్కీ కౌశల్’ ఎవరో తెలుసా?
యానిమల్ పార్క్‌లో విక్కీ కౌశల్ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్లో అతడు స్టార్ హీరో. ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. రీసెంట్గా షారుక్ ఖాన్ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!