ఈ ఏడాది ఆస్కార్ అవార్డు దక్కించుకున్న హాలీవుడ్ చిత్రాలలో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ (Anatomy of a Fall) ఒకటి. ఫ్రెంచ్ లీగల్ డ్రామాగా 2023లో విడుదలైన ఈ చిత్రం.. 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డును గెలుచుకుంది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా అవార్డులను కొల్లగొట్టిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో ‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడం, మలయాళం తమిళం భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. గతంలో ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో మాత్రమే అమెజాన్‌లో అందుబాటులో ఉండేది. ఆస్కార్ రావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ ఏర్పడింది. ముఖ్యంగా సినిమాలను అమితంగా ఇష్టపడే దక్షిణాది ప్రేక్షకులు అందులోనూ తెలుగువారు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తు వచ్చారు. దీంతో ఈ సినిమాను అమెజాన్ నిర్వహకులు దక్షిణాది భాషలతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’ అమెజాన్‌లో మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. అటు ఐఎండీబీ (IMDB)లో ఈ సినిమా 7.7 రేటింగ్ సాధించింది.
మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లేకు ఆస్కార్
‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’ చిత్రంలో ‘సాండ్రా హుల్లర్’ నటన తర్వాత ప్రధానంగా ఆకట్టుకునే ఆంశం ‘స్క్రీన్‌ప్లే’. డైరెక్టర్ జస్టిన్ ట్రైట్ (Justin Triet) కథను నడిపించిన తీరు ఎంతో వినూత్నంగా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఓ వైపు కోర్టు సన్నివేశాలను నడిపిస్తూనే అదే సమయంలో గతంలో ఏం జరిగిందో ఆడియన్స్‌కు క్లారిటీ ఇస్తూ వస్తుంటాడు డైరెక్టర్. కేసు దర్యాప్తు సందర్భంగా వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తుంటాయి. అందుకే ఈ సినిమా స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌ను కొల్లగొట్టింది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’ కచ్చితంగా నచ్చుతుంది.
జస్ట్‌లో హీరోయిన్‌కు ఆస్కార్ మిస్!
‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’ చిత్రంలో ‘సాండ్రా హల్లర్’(Sandra Huller) ప్రధాన పాత్రలో కనిపించింది. సినిమా మెుత్తాన్ని ఆమె తన భుజాలపై వేసుకొని మోశారు. తన నటనతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి ఆమె నటన కూడా ఓ కారణమని చెప్పవచ్చు. ఆస్కార్ ఉత్తమ నటి నామినేషన్స్‌లోనూ ‘సాండ్రా హల్లర్’ చోటు దక్కింది. దీంతో ఆస్కార్ ఉత్తమ నటి పురస్కారం ఆమెకు రావడం ఖాయమని అంతా భావించారు. అయితే కొద్దిలో ఆ అవకాశం ఆమెకు దూరమైంది. ‘పూర్ థింగ్స్’ సినిమాలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఎమ్మా స్టోన్‌కు ఈ అవార్డ్ దక్కింది. కాగా, ఈ ‘పూర్ థింగ్స్’ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటి?
‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’ సినిమాలో ‘సాండ్రా హుల్లర్’ తన భర్త మరణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రచయితగా కనిపించింది. కథలోకి వెళ్తే.. మంచుకొండల్లో సాండ్రా.. తన భర్త, కొడుకుతో ఒంటరిగా జీవిస్తుంటుంది. ఓ రోజు ఆమె భర్త అనుమానస్పదంగా కొండపై నుంచి కిందపడి మరణిస్తాడు. ఆ ప్రాంతంలో సాండ్రా తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమె ఈ హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తుంటారు. కొడుకు కూడా తన తల్లే హంతకురాలు అనే స్థితికి వెళ్తాడు. తాను నిర్దోషినని నిరూపించుకునే ఆధారాలు సాండ్రాకు కనిపించవు. ఊహలకు అందని ట్విస్ట్‌లతో నడిచే ఈ కథలో అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఈ నేరం నుంచి సాండ్రా ఎలా బయటపడుతుంది? తాను హత్య చేయలేదని ఎలా ప్రూవ్ చేసింది? అసలు ఆమె భర్తది హత్యా? లేక ప్రమాదామా? అనేదే మిగిలిన కథ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది