• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Maharaja Movie OTT: ‘మహారాజ’ ఓటీటీ డేట్‌ లాక్‌.. ఈ సినిమా ఎందుకు సెన్సేషన్ అయిందో తెలుసా?

    విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రం ‘మహారాజ’ (Maharaja). క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం, జూన్‌ 14న థియేటర్లలో విడుదలై ఊహించని స్థాయిలో ఘన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి సక్సెస్‌ను సాధించింది. భారీ ప్రమోషన్స్, స్టార్‌ క్యాస్టింగ్‌ లేకున్నా ఒక చిత్రానికి సరైన కంటెంట్ ఉంటే చాలు అని నిరూపించింది. కాగా, థియేటర్‌లో ఈ సినిమాను మిస్‌ అయిన వారికి ప్రముఖ ఓటీటీ వేదిక గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘మహారాజ’ ఎందుకు ఇంత సక్సెస్‌ అయ్యింది? ప్రేక్షకులను ఏ ఏ అంశాలు ఆకట్టుకున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    విజయ్‌ సేతుపతి హీరోగా  నిథిలన్‌ స్వామినాథన్‌ (Nithilan Swaminathan) తెరకెక్కించిన ‘మహారాజ’ (Maharaja OTT Platform) చిత్రం ఓటీటీ డేట్‌ను లాక్‌ చేసుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌  వేదికగా జులై 12 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది. అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) కీలకపాత్రలో కనిపించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్‌ (Mamta Mohandas), నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు నటించారు. 

    రూ.100 కోట్ల కలెక్షన్స్‌

    మహారాజ సినిమా విజయ్‌ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా రూపొందింది. రిలీజ్‌కు ముందు వరకూ ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. చిత్ర యూనిట్‌ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ చేసింది లేదు. దీంతో ఒక సాధారణ చిత్రంగా ‘మహారాజ’ థియేటర్లలోకి వచ్చింది. కానీ, తొలి ఆట మాహారాజ ప్రభంజనం మెుదలైంది. సర్వత్ర పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తద్వారా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరి మహారాజ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.100.18 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు మేకర్స్ నాలుగు రోజుల క్రితమే ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. కంటెంట్‌ సినిమాలకు ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారో మహారాజ మరోమారు నిరూపించింది. 

    సక్సెస్‌కు కారణాలు ఇవే!

    దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌ ఓ భిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘మహారాజ’ను తెరకెక్కించారు. సినిమా ఓ రొటిన్‌ రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కినప్పటికీ స్క్రీన్‌ప్లే మాత్రం ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. కథను భూత భవిష్యత్‌ కాలాల్లో పార్లర్‌గా నడిపించి దర్శకుడు ఇంప్రెస్‌ చేశాడు. ఊహలకి అందని ట్విస్టులతో భావోద్వేగభరితంగా నడిపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌లో వచ్చే ట్విస్టులు, విజయ్‌ సేతుపతి యాక్షన్‌ ప్రేక్షకులను ఫిదా చేశాయి. అంతేకాదు విజయ్‌ సేతుపతి పాత్రను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహారాజ కూతురుకి జరిగిన అన్యాయం వీక్షకుల హృదయాలను బరువెక్కించింది. హీరో కడుపుకోత గురించి అర్థమయ్యాక పోలీసులు సైతం అతడి పగలో భాగకావడం చప్పట్లు కొట్టించింది. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టే ‘మహారాజ’ చిత్రం ఈ స్థాయి విజయాన్ని అందుకోగలిగింది.

    కథేంటి

    బార్బర్‌గా పనిచేసే మ‌హారాజ (విజ‌య్ సేతుప‌తి) అనుకోని ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుంటాడు. కూతురు జ్యోతియే ప్రాణంగా సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. కట్‌ చేస్తే ఒక రోజు మ‌హారాజ గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తాడు.  ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని ఫిర్యాదు చేస్తాడు. ఈ క్ర‌మంలోనే త‌న బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మీని ఎత్తుకెళ్లిపోయార‌ని చెబుతాడు. ఎలాగైన ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌ను వేడుకుంటాడు. ఇంతకీ ఆ ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజాపై దాడి ఎందుకు జరిగింది? వారితో మహారాజాకు ఉన్న వైరం ఏంటి? మహారాజా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? మహారాజ స్టేషన్‌కు వెళ్లడం వెనక దాగున్న వ్యూహాం ఏంటి? అన్నది కథ. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv