• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాల‌కృష్ణ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా?

    ఎన్‌టీఆర్‌, బ‌స‌వ‌తార‌కం దంప‌తుల‌కు ఆరో సంతానం బాల‌కృష్ణ.  జూన్ 10, 1960లో చెన్నైలో జ‌న్మించారు. ఆయ‌న బాల్యం అంతా అక్క‌డే గ‌డిచిపోయింది. ఆ త‌ర్వాత తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ హైదరాబాద్‌కు రావ‌డంతో ఎన్‌టీఆర్ కుటుంబం ఇక్క‌డే స్థిర‌ప‌డింది.

    న‌ట‌న‌పై ఆస‌క్తి

    బాల‌య్య‌కు తండ్రి ఎన్‌టీఆర్‌ను చూస్తూ చిన్న‌ప్ప‌టినుంచే సినిమాల‌పై ఆస‌క్తి పెరిగింద‌ట‌. దాన్ని గ‌మ‌నించిన ఎన్‌టీఆర్ అత‌డిని యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించాడు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి వంటివాటిలో శిక్ష‌ణ ఇప్పించాడు.

    చ‌దువు

    బాల‌య్య నిజాం కాలేజీలో బీకామ్ పూర్తిచేశాడు. ఆ త‌ర్వాత సినిమాల‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు.

    వివాహం

    1982లో 22 ఏళ్ల వ‌య‌సులో బాల‌య్య వ‌సుంద‌రా దేవిని పెళ్లిచేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్ల‌లు. బ్రాహ్మిణి, మోక్షజ్ఞ, తేజ‌స్విని

    బాల‌య్య మొద‌టి సినిమా

    1974లో 14 ఏళ్ల వ‌య‌సులో బాల‌య్య ఎన్‌టీఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాత‌మ్మ క‌ల సినిమాలో బాల‌న‌టుడిగా మొద‌టిసారిగా వెండితెర‌పై క‌నిపించాడు.

    బాల‌య్య  హీరోగా న‌టించిన మొద‌టి సినిమా

    రామ్ ర‌హీమ్‌లో బాల‌య్య హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.

    బాల‌య్య 100వ సినిమా

    గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి

    బాల‌య్య ప్ర‌త్యేక‌త‌లేంటి?

    బాల‌య్య చెప్పే డైలాగ్స్ సినిమాల్లో ప్ర‌త్యేకంగా నిలుస్తాయి. చిన్న‌పిల్ల‌ల నుంచి పెద్ద‌వాళ్ల వ‌ర‌కు అంద‌రికీ బాల‌య్య డైలాగ్స్ గుర్తుండిపోతాయి. బాల‌య్య కేవ‌లం మాస్, యాక్ష‌న్ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా పౌరాణికం, పీరియాడిక‌ల్, సోష‌యోలాజిక‌ల్ సినిమాల్లో కూడా న‌టించాడు. ముఖ్యంగా ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు బాల‌కృష్ణ చేసిన న్యాయం మ‌రే ఇత‌ర హీరోలు చేయ‌లేరు.

    సేవా కార్య‌క్ర‌మాలు

    త‌ల్లి క్యాన్స‌ర్ బారిన ప‌డి మ‌ర‌ణించ‌డంతో ఆమె పేరు మీద బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ ప్రారంభించిన బాల‌య్య ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తున్నాడు. 

    సంచ‌ల‌న నిర్ణ‌యం

    బాల‌య్య న‌టించిన బంగారు బుల్లోడు, నిప్పుర‌వ్వ ఒకేరోజు రిలీజ్ చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. ఏ హీరో చేయ‌లేని సాహ‌సం చేసి చూపించాడు.

    ఎన్‌టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టించిన సినిమాలు

    తాత‌మ్మ క‌ల‌, దాన వీర శూర క‌ర్ణ‌, శ్రీమ‌ద్విరాట‌ప‌ర్వం, అన్న‌ద‌మ్ముల అనుబంధం

    సూప‌ర్ హిట్ సినిమాలు

    మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు, భార్గ‌వ రాముడు, ముద్దుల మావ‌య్య‌, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్, బంగారు బుల్లోడు, స‌మ‌ర‌సింహా రెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు, సింహ‌, లెజెండ్, అఖండ‌

    రాజ‌కీయాలు

    మొద‌టినుంచి టీడీపీలో కొన‌సాగుతున్న బాల‌కృష్ణ 2014లో అనంత‌పూరంలోని హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019లో కూడా మ‌రోసారి ప్ర‌జ‌లు బాల‌య్య‌నే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.

    కాంట్ర‌వర్సీలు

    బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జ‌రిపిన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. అదేవిదంగా ఒక‌సారి వేదిక‌పై మ‌హిళ‌ల‌ గురించి త‌ప్పుగా మాట్లాడ‌టంతో అసెంబ్లీ సాక్షిగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది.

    అవార్డులు

    3 నంది అవార్డులు, సినిమా అవార్డు, 3 సంతోషం అవార్డులు, 3 టీఎస్ఆర్ నేష‌న‌ల్ అవార్డులు, సైమా అవార్డు, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు మొత్తం 25 అవార్డుల‌ను సొంతం చేసుకున్నాడు బాల‌య్య‌. 

    హోస్ట్‌గా బెస్ట్‌

    మొట్ట‌మొద‌టిసారిగా ఆహా ఓటీటీలో అన్‌స్టాప‌బుల్ అనే సెల‌బ్రిటీ టాక్ షో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన బాల‌య్య అందులోనూ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు. ఐఎండీమీ రేటింగ్స్‌లో అన్‌స్టాప‌బుల్ షో టాప్‌లో నిలిచిందంటే ఆ క్రెడిట్ అంతా బాల‌య్య‌కే ద‌క్కుతుంది.

    NBK 107

    ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో 107వ సినిమాలో న‌టిస్తున్నాడు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో బాల‌య్య మ‌రోసారి త‌న మార్క్ న‌ట‌న‌తో అల‌రించ‌బోతున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv