• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hari Hara Veera Mallu: సమ్మర్‌ బరిలో పవర్‌స్టార్‌.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్‌ దేవరకొండ!

    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్‌ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే అదే రోజున విజయ్‌ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. 

    సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌

    పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో పవన్‌ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్‌ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్‌ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

    ఫస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం!

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish)  కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

    ఆ చిత్రాల్లోనూ కదలిక!

    హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ పవన్‌ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్‌ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్‌ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్‌ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్‌ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్‌ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్‌ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్‌ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.  

    పవన్‌ vs విజయ్‌ దేవరకొండ!

    హరి హర వీరమల్లు రిలీజ్‌ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్‌ వద్ద పవన్‌, విజయ్‌ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్‌ నటిస్తున్న ‘VD 12‘ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పవన్‌ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్‌ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు ‘VD 12’ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న ‘సికిందర్‌’ చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్‌ సందర్భంగా రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్‌ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv