కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు యెల్దండి (Venu Yeldandi) కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. ఆ తర్వాత బజర్దస్త్ కామెడీ షాలో టీమ్ లీడర్‌గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గా మారిన వేణు గతేడాది ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. తెలంగాణ గ్రామీణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వేణు తర్వాతి ప్రాజెక్ట్‌పై సహజంగానే అందరి దృష్టి ఏర్పడింది. అయితే బలగం వచ్చి ఏడాది దాటిన ఒక్క ప్రాజెక్ట్ వేణు అనౌన్స్ చేయకపోవడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరోతో వేణు సినిమా ఓకే అయినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
వేణు డైరెక్షన్లో నితిన్!
బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు బ్యానర్లోనే తన రెండో చిత్రం ఉంటుందని గతంలోనే కమెడియన్, దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించారు. రెండో చిత్రానికి సంబంధించిన కథను ఎప్పుడో సిద్దం చేసిన వేణు త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో నితీన్‌తో తన తర్వాతి చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ గురించి నితీన్‌కు చెప్పగా కొన్ని మార్పులతో ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడని సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి ‘యల్లమ్మ’ (Yellamma Movie) అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
నాని, తేజ సజ్జా రిజెక్ట్!
వాస్తవానికి నేచురల్ స్టార్ నానితో వేణు యెల్డండి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే ‘యల్లమ్మ’ స్టోరీని నానికి వేణు వినిపించారు. కానీ సెకండ్ హాఫ్ పట్ల నాని సంతృప్తి చెందలేదని తెలిసింది. వేణు కూడా కథ పరంగా వెనక్కి తగ్గకపోవడంతో నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తేజ సజ్జకు స్టోరీ వినిపించగా ఈ యంగ్ హీరో ఓకే కూడా చెప్పారని తెలిసింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కాంబో కూడా సెట్ కాలేదు. ఫైనల్‌గా నితీన్ వద్దకు కథను తీసుకెళ్లిన వేణు ఫైనల్‌గా అతడ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది.
షూటింగ్ ఎప్పుడంటే?
ఇక వేణు యెల్దండి డైరెక్ట్ చేయనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు వేణు కూడా హాజరయ్యారు. అతడు స్టేజ్ పైకి వెళ్లగానే కింద కూర్చున్న దిల్ రాజు ‘ఎల్లమ్మ’ ఎప్పుడు అని అడిగాడు. దీనికి వేణు స్పందిస్తూ ‘అదేదో సామెత చెప్పినట్లు ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే.. మీరే చెప్పాలి. నేను రేపు మొదలు పెట్టమన్నా రెడీ. చెప్పండి.. నవంబర్‌లో చేద్దామా అని అన్నాడు. దీనికి దిల్ రాజు బదులిస్తూ ‘వద్దులే ఫిబ్రవరిలో మొదలుపెడదాం’ అని స్పష్టం చేశారు.
‘బలగం’కు అవార్డుల పంట
హాస్య నటుడు ప్రియదర్శి (Priyadarsi), కావ్యా కళ్యాణ్‌రామ్ (Kavya Kalyanram) జంటగా వేణు యెల్దండి తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) చిత్రం గతేడాది మార్చి 3న విడుదలైంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళిధర్ గౌడ్, కోటా జయరామ్, మైమ్ మధు ముఖ్యపాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పల్లెల్లో స్పెషల్ షోలను సైతం వేశారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ‘బలగం’ చిత్రం ఏకంగా మూడు అవార్డులు కొల్లగొట్టింది. అలాగే ఒక సైమా అవార్డు, సంతోషం అవార్డ్‌ను సొంతం చేసుకుంది.