పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీలోని ప్రముఖ నాయకులందరూ ఓటమిపాలయ్యారు. ఇక పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌సింగ్ చన్నీ అయితే ఏకంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓటమిని చవి చూశారు.
స్వీపర్ కొడుకు చేతిలో
సీఎంగా ఉన్న చన్నీ భదౌర్ నియోజకవర్గంలో పోటీ చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన లాభ్ సింగ్ అనే వ్యక్తి చేతిలో చన్నీ 37,550 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లాభ్ సింగ్ ఒక మొబైల్ రిపేరింగ్ షాపులో పని చేసేవాడు. లాభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పని చేసేది. ఇక లాభ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ మామూలు కూలీ. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఓడించడం చాలా గొప్ప విషయం.
చీపురును వదలను
లాభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ మాట్లాడుతూ… చీపురు తన జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిందని తన కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన తాను తన స్వీపర్ జాబ్‌కు రిజైన్ చేయనని ప్రకటించారు. తాను ఎప్పటిలాగే స్వీపర్ గా కంటిన్యూ అవుతానని ప్రకటించారు. తన కొడుకు ప్రజల కోసం సేవ చేయాలే తప్ప తన సొంత కుటుంబం కోసం చేయకూడదన్నారు.
లాభ్ సింగ్ ఓ బ్రిలియంట్ స్టూడెంట్..
ఎమ్మెల్యేగా గెలిచిన సామాన్యుడు లాభ్ సింగ్ చదివిన స్కూల్ ప్రిన్సిపల్ అమృత్ పాల్ కౌర్ మాట్లాడుతూ.. లాభ్ సింగ్ బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్పింది. తన తల్లి స్వీపర్ గా పని చేసే పాఠశాలలోనే లాభ్ సింగ్ తన చదువును కొనసాగించాడు. లాభ్ సింగ్ స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో పాఠశాలకు ఎన్నో అవార్డులను తీసుకొచ్చాడని అమృత్ పాల్ కౌర్ తెలిపింది.
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
సామాన్యుడు లాభ్ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాభ్ సింగ్ సీఎం అంతటి గొప్ప వ్యక్తిని ఓడించడం గొప్ప విషయమని చెబుతున్నారు. సామాన్యుడిలా తమకు తెలిసిన లాభ్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచాడంటే నమ్మలేకపోతున్నామని గ్రామ ప్రజలు తెలిపారు.
మేమే ఇలాగే జీవిస్తాం..
ప్రజలు తన కొడుకును ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని లాభ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ అన్నారు. తన కొడుకు ప్రజల కోసం పని చేయాలని తాము ఇలాగే జీవనం గడుపుతామని ఆయన తెలిపారు.
2013లోనే..
లాభ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో 2013లోనే చేరారు. పార్టీలో చేరిన దగ్గరి నుంచి పార్టీ గెలుపు కోసం పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడం కోసం రేయింబవళ్లు కష్టపడ్డాడు. 2017లో అతడు పోటీ చేయాలని భావించినప్పటికీ అధిష్టానం మాత్రం అతడికి సీటు కేటాయించలేదు. చివరికి 2022 ఎన్నికల్లో ఆప్ లాభ్ సింగ్‌కు సీటు కేటాయించింది. అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా లాభ్ సింగ్ సీఎంనే ఓడించడం గమనార్హం.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం