• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భర్తను భార్యలకు సమానంగా పంచిన ఫ్యామిలీ కోర్టు

    మధ్యప్రదేశ్‌లో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యపరిచింది. భర్త విషయంలో ఇద్దరు భార్యలు గొడవ పడుతుండటంతో అతడిని సమానంగా విభజించింది. మూడ్రోజులు ఒక భార్య వద్ద, మరో మూడ్రోజులు మరొకరి వద్ద గడపాలని ఆదేశించింది ఫ్యామిలీ కోర్టు. మిగిలిన ఆదివారం భర్త కోరిక మేరకు ఎవరి వద్దనైనా ఉండవచ్చని ఒప్పందు కుదిర్చింది. గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి హరియాణాలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2018లో పెళ్లి చేసుకున్న అతడు.. లాక్‌డౌన్ సమయంలో భార్యను ఇంటికి పంపి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో ఇద్దరికి గొడవలు వచ్చాయి.

    అసలు ఏం జరిగిందంటే? ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీమ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు. 2020లో కరోనా రావటంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో భార్య, కుమారుడిని పుట్టింటికి పంపాడు. అప్పుడు ఒంటరిగా ఉన్న అతడు లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత భార్య లేకుండానే హరియాణా వెళ్లాడు. 

    హరియాణాలో పనిచేస్తున్న కంపెనీలో ఓ ఉద్యోగితో సంబంధం పెట్టుకొని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకి ఓ పాప పుట్టింది. భర్త వస్తాడని ఎదురుచూసిన సీమ.. ఓపిక నశించి హరియాణా వెళ్లటంతో అసలు విషయం బయటపడింది. దీంతో భర్తను నిలదీసి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. 

    న్యాయం చేయాలంటూ గ్వాలియర్‌లోని ఫ్యామిలి కోర్టును ఆశ్రయించింది సీమ. వారికి 6 నెలల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన ఫలితం లేదు. భర్త దగ్గర్నుంచి ఆర్థిక సహాయం అందడం లేదంటూ చెప్పడంతో ముగ్గురితో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. మూడ్రోజులు ఒకరి దగ్గర, మరో మూడ్రోజులు రెండో భార్య దగ్గర ఉండాలని సూచించారు. ఆదివారం అతడి ఇష్టానికి వదిలేశారు. 

    ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుకు ఇద్దరు భార్యలు అంగీకరించడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ తీర్పు తర్వాత ఇంజినీర్ వారిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv