• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రేకప్ చెప్పిందని అఘాయిత్యానికి ఒడిగట్టిన ప్రేమికుడు

    ప్రేమకు నేటి రోజుల్లో అర్థాలే మారిపోతున్నాయి. బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత అతడు ప్రేమించిన అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ యువతి సదరు యువకుడికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత ఆ యువతిని పరిపరి విధాలా అభ్యర్థించిన అతగాడు..తనను ప్రేమించేలా చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా యువతిని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన యువతి తల్లిదండ్రులు సదరు యువతిని వేరే ప్రాంతానికి పంపారు. ఈ క్రమంలో అక్కడి నుంచి తిరిగి వచ్చిన యువతిని అతడు కిడ్నాప్ చేశాడు. యువతిని కారులో బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి తన పేరును ఆ యువతి ముఖం మీద టాటూగా వేశాడు. స్వతహాగా టటూ ఆర్టిస్ట్ అయిన ఆ యువకుడికి ఇది సులభం అయింది. తన కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆ యువతిని వెతికి పట్టుకున్నారు. ఆ యువకుడు ఇలా చేయడంపై అతడి తండ్రి చాలా సంతోషంగా ఫీలవుతున్నాడు. ఆ యువతి పేరు తాయానే కాల్డెస్ (18), యువకుడి పేరు గాబ్రియెల్ కొయెల్హో (20)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv