చిరుతను చూస్తేనే భయపడతాం. అలాంటిది దాడి చేసిన చిరుతపులిని బైక్ మీద బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించిన ఘటన కర్నాటకలో జరిగింది. పొలానికి వెళ్తుండగా వేణుగోపాల్‌పై చిరుతపులి దాడికి ప్రయత్నించింది. దీంతో ధైర్యం చేసి చిరుతను వెంబడించి బంధించాడు. అనంతరం, తాడుతో బైక్ వెనక్కి చుట్టి ఊర్లోకి తీసుకొచ్చాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. చిరుతను అదుపులోకి తీసుకుని చికిత్స చేయించారు. యువకుడి ధైర్య సాహసాలను గ్రామస్థులు మెచ్చుకున్నారు.
-
Courtesy Twitter:@TeluguScribe
-
Courtesy Twitter:@TeluguScribe