• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కర్ణాటకలో జికా వైరస్ కలకలం

  కర్ణాటకలో జికా వైరస్‌ కలకలం రేపుతోంది. చిక్కబళ్లాపుర్‌ జిల్లాలో కొత్త కేసు నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిలో వంద మంది నుంచి శాంపిళ్లను సేకరించింది. వీటిని పరీక్షించగా ఒకరికి జికా పాజిటివ్‌ వచ్చింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నివాసప్రాంతం చిక్కబళ్లాపుర్‌ కావడంతో వైద్యవర్గాలు అప్రమత్తమయ్యాయి. రాయచూర్‌ జిల్లాలో 5 ఏళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు.

  డీకే శివకుమార్‌కు కేటీఆర్ కౌంటర్

  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘కర్ణాటకలు రైతులకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వని మీరు.. ఇక్కడ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న మమ్మల్ని తప్పుపడుతారా? అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క హామీని అయినా అమలు చేస్తున్నారా? బెంగుళూరులోనూ కరెంట్ కట్‌లతో పరిశ్రల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ముందు మీ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూసుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు.

  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

  కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో 12 మంది దుర్మరణం చెందారు. బాధితులు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల వాసులుగా తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి పొగమంచు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

  పట్టపగలు రూ.14 ల‌క్ష‌ల‌ు దోచేశారు

  క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో భారీ చోరీ జ‌రిగింది. పార్కింగ్ చేసిన BMW కారు నుంచి రూ.14 ల‌క్ష‌ల‌ను గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు దుండగులు అప‌హ‌రించారు. ఈ చోరీ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రూ. కోటి విలువ చేసే బీఎండ‌బ్ల్యూ కారును సోంపుర‌లోని స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసు వ‌ద్ద ఉన్న పార్కింగ్‌లో నిలిపారు. బైక్‌పై వ‌చ్చిన దుండగుల్లో ఒకడు కారు అద్దాల‌ు ప‌గుల‌గొట్టి డబ్బు ఉన్న కవర్‌ను తీసుకున్నాడు. ఆపై అక్కడి నుంచి క్షణాల్లో దుండగులు చెక్కేశారు. దొంగల కోసం పోలీసులు … Read more

  భర్తను రూ.5 లక్షలకు అమ్మేసిన భార్య

  పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను మరో మహిళకు భార్య అమ్మెసిన ఘటన కర్ణాటకలోని మాండ్యలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ మహిళతో ఆ గృహిణి భర్త సన్నిహితంగా ఉండేవాడు. ఓ రోజు స్థానిక మహిళతో తన భర్త పడకగదిలో ఉండటం గృహిణి గుర్తించింది. ఇద్దర్ని పంచాయతీకి లాగింది. తన దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడని వాటిని తిరిగిస్తే అతన్ని అప్పగిస్తానని మహిళ తెలిపింది. దీనికి ఒప్పుకోని గృహిణి ఆ రూ.5 లక్షలు తనకే మనోవర్తిగా ఇస్తే తన భర్తను వదిలిపెడతానని తెలిపింది. దీనికి … Read more

  తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్‌’కు చోటు లేదు: KTR

  కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కర్ణాటక నుంచి డబ్బులు తలిస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘స్కామ్ గ్రెస్‌’కు తెలంగాణలో చోటు లేదని మంత్రి పేర్కొన్నారు.

  తమిళనాడు- కర్ణాటక మధ్య ఉద్రిక్తత

  తమిళనాడు- కర్ణాటక సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కావేరి నది జలాల విడుదలను నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా బంద్ తలపెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలు వరుస ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. https://x.com/appudynasty1/status/1705808522603315601?s=20

  కర్ణాటకలో శునకానికి సీమంతం

  పెంపుడు జంతువులను కన్న బిడ్డలతో సమానంగా సాకడం మనం చూస్తుంటాం. వాటికి నిత్యం సపర్యలు చేస్తూ జంతు ప్రేమికులు పెంచుతుంటారు. అయితే, కర్ణాటకలో ఓ శునకానికి ఏకంగా సీమంతం చేశారు. గదగ్ జిల్లాలో జంతు ప్రేమికుడు అశోక్ తన పెంపుడు జంతువుకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెగ్యులర్‌గా చేసే సీమంతం మాదిరే ఇరుగు పొరుగు వారిని పిలిచి వేడుకలా జరిపించారు. శునకానికి దండ వేసి, బొట్టు పెట్టి, వస్త్రం వేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కుక్కకు సీమంతం కర్ణాటకలోని గదగ్ జిల్లాలో … Read more

  షాకింగ్‌.. ఎగిరిపడ్డ విద్యార్థినులు

  కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది. దీంతో బైకర్‌తో పాటు విద్యార్థులు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు విద్యార్థినులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. A hit & run case has been caught on camera in … Read more

  ట్రెక్కర్లతో గుంజీలు తీయించిన పోలీసులు

  గోవా-క‌ర్నాట‌క బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం చూసేందుకు వచ్చిన ట్రెక్కర్లతో పోలీసు గుంజీలు తీయించారు. జలపాతం చూసేందుకు వచ్చి రైలు నిర్ణీత ప్రదేశానికి చేరక ముందే కొందరు దిగిపోయారు. వారు రైలు పట్టాల వెంట ట్రెక్కింగ్ చేస్తూ పోలీసుల కంటపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని ట్రెక్కింగ్ చేయకూడదన్న నిబంధనలను ఉల్లంఘించినందుకు వారి చేత గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Railway Police Punish Trekkers at Dudhsagar Waterfall. #Dudhsagar #travel pic.twitter.com/hM94awOmcy — … Read more