• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆప్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందా ?

    పంజాబ్‌లో తాజా ఫలితాలను చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. భాజపాకు ప్రత్యామ్నాయంగా అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ని స్థాపించి దిల్లీలో రెండు సార్లు విజయదుందుభి మోగించి సీఎంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌లో కూడ పోటీ చేసి పార్టీకి అనూహ్య విజయం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలు ఉండగా ఆప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి 90 స్థానాలతో ముందంజలో ఉంది. అలాగే గోవాలో కూడ 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. ఈ ఫలితాలను బట్టి చూస్తే కేజ్రీవాల్ త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి తోడు భాజపాను ఎదుర్కొనే విధంగా ప్రస్తుతం ఏ పార్టీ లేకపోవడంతో ఆప్ ఏ ప్రత్యామ్నాయం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

     ఆమ్ ఆద్మీ పార్టీ  అధికారం చేపడుతున్న రెండో రాష్ట్రం పంజాబ్. కేజ్రీవాల్ 2015లో కూడ దిల్లీలో పోటీ చేసి అనూహ్యంగా 70 స్థానాల్లో 67 స్థానాలు దక్కించుకొని దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. అప్పటికే ఫామ్ కొనసాగిస్తున్న భాజపాకు ఒక్కసారిగా షాకిచ్చాడు. ప్రస్తుతం పంజాబ్ ఫలితాల్లో కూడ 117 సీట్లలో 92 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ ఒకసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండానే చేపకింద నీరులా ఆప్‌ని అన్ని రాష్ట్రాలకు కేజ్రీవాల్ విస్తరింపజేస్తున్నాడు.

         ప్రస్తుత ఫలితాలు ఆప్ నాయకులు, కార్యకర్తల్లో నూతనుత్తేజాన్ని నింపుతున్నాయి. అలాగే పార్టీ ముఖ్య నేతలు కూడ మరింత దూకుడుగా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రల్లోనే ఉన్న అధికారాన్ని అన్ని రాష్ట్రాల్లో నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫలితాలు త్వరలో రానున్న హర్యానా ఎన్నికలపై కూడ ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్‌కి మార్గం సుగమం చేసే విధంగా కేజ్రీవాల్ ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv