పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. ‘పుష్ప’ సక్సెస్‌తో ఆయన జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లో ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ బన్నీ తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ చిన్న ఈవెంట్ అయినా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేస్తారు. ఈ క్రమంలోనే బన్నీ సతీమణి స్నేహా రెడ్డి 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
సర్‌ప్రైజ్ ఏంటంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన 40 పుట్టినరోజును ఆదివారం (సెప్టెంబర్ 29) ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే భార్య బర్త్‌డేకి బన్నీ అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్నేహాకు తెలియకుండా ఆమె సొంత అక్కని, బెస్ట్ ఫ్రెండ్స్‌ను గోవాకు పిలిపించి సర్‌ప్రైజ్ చేశారు. వారిని సడెన్‌గా చూసిన స్నేహ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి ఆనందంలో మునిగి తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ అదిరిపోయిందంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ-స్నేహా జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని పోస్టులు పెడుతున్నారు.
ఫోటోలు షేర్ చేసిన స్నేహా
గోవాలో తన బర్త్‌డేకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అల్లు స్నేహారెడ్డి పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. గార్డెన్‌లో భర్త అల్లు అర్జున్, పిల్లలు అల్లు అయాన్, ఆద్య సమక్షంలో స్నేహా కేక్ కట్ చేశారు. తన బర్త్‌డేకు వచ్చిన ఫ్రెండ్స్‌తోనూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ బర్త్‌డే సందర్భంగా ఇచ్చిన సర్‌ప్రైజ్, గిప్ట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ ఈ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. స్టార్ హీరోయిన్ సమంత ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ స్నేహాకు కామెంట్ బాక్స్‌లో విష్ చేయడం గమనార్హం.
స్నేహాకు షాకిచ్చిన మెగా ఫ్యామిలీ!
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు గత కొన్నిరోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు స్నేహారెడ్డి బర్త్‌డే సందర్భంగా ఈ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి స్నేహా రెడ్డికి ఎలాంటి బహిరంగ విషెస్ రాకపోవడం చర్చకు తావిస్తోంది. ఈ ఏడాది జులై 20న మెగా కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యామిలీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విషెస్ చెప్పింది. మహేష్ భార్య నమ్రత, తారక్ వైఫ్ లక్ష్మీ ప్రణతి, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠితో పాటు పలువురు సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మెగా ఫ్యాన్స్ సైతం ఉపాసనకు విషెస్ చెప్తూ పోస్టులు పెట్టారు. అయితే స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి హడావుడి కనిపించలేదు. అటు ఫ్యాన్స్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈ ఘటనతో ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు మరోమారు భగ్గుమన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఫైనల్ స్టేజ్‌కి ‘పుష్ప 2’ షూటింగ్!
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ (Sukumar) ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ను తెరకెక్కిస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, బన్నీపై సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) షూటింగ్ స్పాట్‌కు వెళ్లి ‘పుష్ప 2’ టీమ్‌ను సైతం కలిశారు. ఇక ‘పుష్ప 2’ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో బన్నీ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?