హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్నప్పటికీ..సినిమాల్లో ఎంత బాగా నటించినప్పటికీ కొంతమందికి జనరల్ నాలెడ్జ్ జీరో ఉంటుంది. అలియా భట్, సోనాక్షి సిన్హా వంటివాళ్లపై ఇంతకుముందు దీనిగురించే ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్‌లో ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే..పృద్విరాజ్ చౌహన్ అని చెప్పి నవ్వుల పాలయ్యింది అలియా. ఆ తర్వాత ఆమె ఎక్కడ కనిపించినా ప్రెసిడెంట్ ఎవరు అని అడగడం మొదలుపెట్టింది మీడియా. దీంతో నాకు ప్రెసిడెంట్ ఎవరో తెలీదు అని ఫైర్ అయిందీ బ్యూటీ. ఇక సోనాక్షి సిన్హా విషయానికొస్తే..రామాయణంలో హనుమంతుడు సంజీవని ఎవరికోసం తీసుకొచ్చాడు అని కేబీసీలో అమితాబ్ ప్రశ్న అడగ్గా..సీత అని చెప్పింది. దీంతో కంగుతిన్నాడు అమితాబ్. మీ నాన్న పేరు శత్రుగ్న సిన్హా, మీ ఇంటి పేరు రామాయణ్ అని ఉంటుంది. మీ బాబాయ్‌ల పేర్లు లక్ష్మణ్, భరత్. ఇక మీ సోదరుల పేర్లు లవ, కుశ అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నీకు ఈ ఆన్సర్ తెలీదా అన్నాడు అమితాబ్. దీంతో అక్కడినుంచి సోనాక్షి పాపకు ట్రోల్స్ ఎదురయ్యాయి. ఇక తాజాగా కత్రినా వీడియో కూడా ఒకటి వైరల్‌గా మారింది.
సూర్యవంశీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ కౌన్ బనేగా కరోడ్‌పతి షో లో పాల్గొన్నారు. కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు అని కత్రినాను అమితాబ్ అడగ్గా, కొన్ని హిస్టరీ బుక్స్, గూగుల్ సర్చ్ చేసి నాలెడ్జ్‌ను పెంచుకొని వచ్చాను అని చెప్పింది. ఇక అక్షయ్ నేను నాకు తెలిసిన వాటికి ఆన్సర్ చేస్తాను అని చెప్పాడు. అయితే షో కోసం ఇంత ప్రిపేర్ అయిన కత్రినాకు షో రూల్స్ తెలియకపోవడం అందరినీ నవ్వించింది. లైఫ్‌లైన్ ఒక్కసారే ఉంటుందా లేదా అన్ని ప్రశ్నలకు యూజ్ చేసుకోవచ్చా అని అడిగింది.. దీంతో అమితాబ్ షాక్ అయ్యాడు. ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి అక్కడ ఉన్న వాళ్లందరూ ఫుల్‌గా నవ్వుకున్నారు. దీంతో అక్షయ్‌కు నవ్వాగలేదు.. సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి షో హోస్ట్ చేస్తున్నారు కానీ ఇటువంటి ప్రశ్న ఎవరు అడగలేదు కదా అన్నాడు.
ఇక మరో వీడియోలో కత్రినా అమితాబ్‌కి డ్యాన్స్ నేర్పిస్తుంది. కత్రినా డ్యాన్స్ చేస్తుంటే ఎవరైనా ఆమెనే చూస్తుంటారు కానీ పక్కనుండి డ్యాన్స్ చేయాలనుకుంటారా అని కాంప్లిమెంట్ ఇచ్చాడు బిగ్‌బీ.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి