ఏ ముహూర్తాన సుకుమార్ సమంతతో ‘ఊ అంటావా మావ, ఊఊ అంటావా మావ’ అంటూ పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయించాడో కానీ, ఆ పాట ఓ సెన్సేషన్‌గా మారింది. ఈ పాటలో సమంత ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి, డ్యాన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఏ సోషల్ మీడియా స్టార్ అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన ఈ పాటపై రీల్ చేయాల్సిందే, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిందే అంటూ మారిపోయింది. దీంతో ఎలాంటి ఈవెంట్ అయినా, ఈ పాట మీద ఓ పెర్ఫార్మెన్స్ ఉంటుంది.
విష్ణుప్రియ ఎంత మంచి యాంకరో, అంత మంచి డ్యాన్సర్ కూడా. తన నటనతో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటించిన విష్ణుప్రియ ఈటీవీలో ప్రసారమైన ‘పోవే పోరా’ షోతో మంచి పాపులారిటీ సాధించింది. అయితే ఈ అమ్మడు పలు షోలలో, రీల్స్‌లలో ఎంత అందంగా, ఎంత పర్ఫెక్ట్‌గా డ్యాన్స్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ అమ్మడు డ్యాన్స్ చేస్తే ఆమె అభిమానులతో సహా ప్రతి ఒక్కరూ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తారు. విష్ణుప్రియ డ్యాన్స్ వీడియో ఉందంటే చాలు ఆ వీడియోకు లైకులు, షేర్లు వేలల్లో వస్తూ ఉంటాయి.
ఎన్నో మంచి మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో కమెడియన్‌గానే కాకుండా, మంచి కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న రాముతో జతకట్టింది విష్ణుప్రియ.. రాముతో కలిసి ‘ఊ అంటావా మావ, ఊఊ అంటావా మావ’ పాట మీద రిహార్సల్ చేస్తుంది. ఈ మేరకు రిహార్సల్ వీడియోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో విష్ణుప్రియ పోస్ట్ చేసింది. కొత్త కొత్త స్టెప్పులతో, మత్తెక్కించే ఎక్స్‌ప్రెషన్స్‌తో విష్ణుప్రియ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. విష్ణుప్రియ అభిమానులు తెగ లైకులు చేస్తూ… విష్ణు ప్రియ ఏంజెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్