• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • APRIL 28: తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్‌బస్టర్‌ డే…. కానీ, అక్కినేని అఖిల్‌కు మాత్రం కాదు!

    ఏప్రిల్ 28…. తెలుగు చిత్ర పరిశ్రమకు కలిసొచ్చిన రోజు. టాప్ హీరోల సినిమాలు విడుదలై బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాయి. ఈ సెంటిమెంట్‌తోనే అఖిల్‌ ఏజెంట్‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ, దారుణమైన టాక్‌తో ఫ్లాప్‌ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ తేదీన అప్పట్లో విడుదలైన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. 

    అడవి రాముడు

    నందమూరి తారకరామరావు నటించిన అడవి రాముడు ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌. 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాటకు జయప్రద, ఎన్టీఆర్ చేసిన డాన్స్‌ ఇప్పటికీ ఫేమస్. 366 రోజులు థియేటర్లలో ఈ సినిమా ఆడింది.

    యమలీల

    కమెడియన్ ఆలీ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా యమలీల. తల్లి సెంటిమెంట్‌తో పాటు చిత్రగుప్తుడు, యమధర్మరాజు క్యారెక్టర్లతో కామెడీ పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా 100 రోజులు థియేటర్లలో ఆడింది. అంతేకాదు, ఇందులో నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అంటూ వచ్చే సాంగ్‌ ప్రేక్షకుల నోళ్లలో ఇప్పటికీ నానుతుంది. 1994లో ఏప్రిల్ 28న వచ్చింది. 

    పోకిరి 

    పూరీ జగన్నాథ్, మహేశ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ కమ్ పోలీస్‌ రోల్‌లో మహేశ్ యాక్షన్ ఇరగదీశాడు. పూరీ మార్క్ డైలాగ్స్‌ యాక్షన్‌తో సినిమా నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లిపోయింది. రూ. 10 కోట్లు పెట్టి తీస్తే రూ. 66 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో 100 డేస్‌ ఆడింది ఈ సినిమా. ఏప్రిల్ 28, 2006లో విడుదలయ్యింది. 

    బాహుబలి 2

    దేశవ్యాప్తంగా బాహుబలి 2 మేనియా కొనసాగింది. ఒక్కసారిగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్‌లను షేక్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 28, 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్‌తో రూ. 1800 కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండో సినిమాగా నిలిచింది. హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది ఈ సినిమాతోనే. 

    ఏజెంట్‌

    పెద్ద సినిమాలు రిలీజై హిట్‌ కొట్టిన రోజున సెంటిమెంట్‌గా అక్కినేని అఖిల్‌ కూడా ఏజెంట్ సినిమాతో వచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిర్మాతలు ఇలా అనుకుంటున్న కారణంగా డేట్ ఫిక్స్ చేశామని వెల్లడించాడు. కానీ, సరైన కథ లేకపోతే ఏ సెంటిమెంట్ వర్కౌట‌్ కాదు. ఏజెంట్ అట్టర్‌ ప్లాప్ కావటమే ఇందుకు నిదర్శనం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv