• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు మరో క్రేజీ ఆఫర్‌.. డెబ్యూ లేకుండానే ముగ్గురు స్టార్‌ హీరోలతో!

    దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రాని పేరు ప్రఖ్యాతలు.. కొందరికి రాత్రికి రాత్రే వచ్చేస్తుంటాయి. ఒక్క బ్లాక్‌ బాస్టర్‌తో స్టార్లుగా మారిపోతుంటారు. ఒకప్పుడు ఎక్కువగా హీరోల్లో ఇలాంటి పరిస్థితి కనిపించేంది. కానీ, ప్రస్తుతం ఈ ట్రెండ్‌ హీరోయిన్ల వైపు మళ్లింది. ఒక్క సక్సెస్‌తో హీరోల కంటే హీరోయిన్లే ఔట్‌స్టాండింగ్‌ ఫేమ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందుకు విరుద్దం. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా రిలీజ్‌ కానప్పటికీ ఆమె టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ అమ్మడిని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రవితేజ, విజయ్‌దేవరకొండ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ దక్కించుకున్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో సినిమాకు ఓకే చెప్పింది. 

    దుల్కర్‌ సల్మాన్‌కు జోడీగా.. 

    భాగ్యశ్రీ బోర్సే పేరు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్  హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) తెలుగులో నేరుగా చేయబోయే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైంది. గతంలో దర్శకుడు పరుశురామ్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రవి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడైంది. ఇందులో నటించేందుకు భాగ్యశ్రీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, అగ్రిమెంట్‌ కూడా కుదుర్చుకుందని మేకర్స్‌ స్పష్టం చేశారు. దీంతో భాగ్యశ్రీ క్రేజ్‌ టాలీవుడ్‌లో మామూల్గా లేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

    భాగ్యశ్రీ ప్రాజెక్ట్స్‌

    భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటికే తెలుగులో రెండు స్టార్‌ హీరోల సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో మాస్‌ మహారాజ్‌ రవితేజ (Ravi Teja) హీరోగా చేస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) సినిమాతో తొలిసారి టాలీవుడ్‌ ఆఫర్‌ను భాగ్యశ్రీ బోర్సే దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో వస్తోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ఈ మూవీ షూటింగ్‌లో కూడా భాగ్యశ్రీ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌ ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే నాని – భాగ్యశ్రీ కాంబోపై అధికారిక ప్రకటన సైతం రానుంది. ఇలా డెబ్యూ రిలీజ్‌ కాకుండానే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

    భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..

    భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం ‘యారియాన్ 2’తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv