• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bharateeyudu 2 Review: ఆ అంశాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ‘భారతీయుడు 2’.. మూవీ ఎలా ఉందంటే!

    నటీనటులు : కమల్‌హాసన్‌, సిద్ధార్థ్‌, కాజల్ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవాని, వివేక్‌

    డైరెక్టర్‌ : శంకర్

    సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌

    సినిమాటోగ్రాఫర్‌ : రవి వర్మన్‌

    ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌

    నిర్మాత : అల్లిరాజా సుభస్కరన్‌

    విడుదల తేదీ: 12-07-2024

    కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ (Bharateeyudu) చిత్రం ఎంతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండితనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. ‘భారతీయుడు 2‘ (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ఎస్‌.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? భారతీయుడిగా మరోమారు కమల్‌ ఆకట్టుకున్నారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్‌ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.

    ఎవరెలా చేశారంటే

    ‘భారతీయుడు 2’లో కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం చూపించాడు. సేనాపతి పాత్రలో మరోమారు తన మార్క్‌ నటన కనబరిచారు. తన నటనతో సినిమా మెుత్తాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. నటుడు సిద్ధార్థ్‌ కూడా కీలక పాత్రలో మెప్పించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె. సూర్య వంటి నటులు కూడా తమ నటనతో సినిమాకు ఎస్సెట్‌గా మారారు. అయితే వారి పాత్రలు బలహీనంగా ఉండటం మూవీకి మైనస్‌గా మారింది. ఇతర నటీనటులు ప్రదర్శన పర్వాలేదు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    డైరెక్టర్‌ శంకర్‌ భారతీయుడు కథనే మళ్లీ రిపీట్‌ చేసినట్లు అనిపించింది. ఔట్‌ డేటెడ్‌ కథను నేటి తరానికి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు. భారతీయుడు ఎలా చంపుతాడో అనేది ఈ తరానికి చూపించడానికే సీక్వెల్‌ తీసినట్లు ఉంది. డైరెక్షన్‌లో శంకర్ మార్క్‌ కనిపించదు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. కమల్‌ హాసన్‌ ఇంట్రడక్షన్‌ కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. కొన్ని సన్నివేశాలను బాగానే తెరకెక్కించినా మరికొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకుల ముందు తేలిపోయాయి. అయితే కమల్ హాసన్‌ ఛేజింగ్ సీక్వెన్స్‌, ముష్కరమూకలతో ఫైట్ సీక్వెన్స్‌ మెప్పిస్తాయి. సోషల్‌ మెసేజ్‌ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చుంది. కానీ, భారతీయుడులో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్‌ లేకపోవడం, పాటలు ఆ స్థాయిలో వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. ఓవరాల్‌గా ఈ సీక్వెల్‌ సేనాపతి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడంలో పూర్తిగా వెనకబడ్డాడని చెప్పవచ్చు.

    సాంకేతిక అంశాలు

    టెక్నికల్‌ విషయాలకు వస్తే.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. అయితే కొన్ని సీన్స్‌ను BGM మరి డామినేట్‌ చేసినట్లు అనిపించింది. సినిమాటోగ్రాఫర్‌ పనితనం బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు మాత్రం చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • కమల్‌ హాసన్‌ నటన
    • సందేశం
    • యాక్షన్‌ సీక్వెన్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • ఔట్‌డేటెడ్‌ స్టోరీ
    • స్క్రీన్‌ప్లే
    • భావోద్వేగాలు పండకపోవడం
    • సాగదీత సన్నివేశాలు

    Telugu.yousay.tv Rating : 2.5/5  

    నెటిజన్లు ఏమంటున్నారంటే? (Public Talk)

    ఎక్స్‌ (ట్విటర్‌)లో సైతం ‘భారతీయుడు 2’ మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది మాత్రమే కామెంట్‌ చేస్తుంటే చాలా మంది ఫ్లాప్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో నెగిటివ్‌ టాక్ ‘భారతీయుడు 2’ చిత్రాన్ని చుట్టేసింది. కొందరు ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహించాడా? అంటూ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. 

    భారతీయుడు 2 సినిమా డిజాస్టర్‌ అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. బోరింగ్‌, ఔట్‌ డేటెడ్‌ స్టోరీ, సాగదీశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ‘భారతీయుడు 2’ స్టోరీ ముందుకు సాగుతున్న కొద్ది బోరింగా అనిపించిందని మరో నెటిజన్ అన్నాడు. ఫస్టాఫ్‌లో గ్రిప్పింగ్‌గా, ఎగ్జైట్‌మెంట్‌ సీక్వెన్స్‌ ఏమి లేవని అన్నాడు. 

    ‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్‌ప్లే అస్సల్‌ బాగోలేదు. ఎమోషనల్‌ సీన్స్‌ వర్కౌట్‌ కాలేదు. ఇండియన్‌ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్‌ చేశారు.

    ‘ఇండియన్‌ 2’ బిలో యావరేజ్‌ చిత్రమని విజయ్‌ అనే నెటిజన్‌ పోస్టు పెట్టాడు. క్లైమాక్స్‌లో ఇండియన్ 3కి సంబంధించిన ట్రైలర్‌ ప్లే చేశారని అది కాస్త ఆసక్తిగా అనిపించిందని చెప్పాడు. ‘ఇండియన్‌ 3’ ఆశలు రేపుతోందని చెప్పుకొచ్చారు. 

    మరో నెటిజన్‌ ‘భారతీయుడు 2’ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. శంకర్‌ డైరెక్షన్‌ మరో లెవల్‌లో ఉందంటూ పోస్టు పెట్టాడు.. కమల్‌ హాసన్‌ నటన, యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగున్నాయంటూ మూవీకి 4 స్టార్‌ రేటింగ్ ఇచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv