చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ బీవైడీ (BYD) పవర్‌ఫుల్ ఈవీ (EV)ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ‘BYD Seal EV’ పేరుతో ఈ కారును థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. అతిత్వరలోనే భారత్ సహా పలు దేశాల్లో ఈ కారును లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కార్ల ప్రియులకు నచ్చే ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. మరి ఈ ఈవీ కారు ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కారు వేరియంట్స్
BYD Seal EV Car కారును కంపెనీ మూడు వేరియంట్లలో రిలీజ్ చేసింది. డైనమిక్ (Dynamic), ప్రీమియం (Premium), ఏడబ్ల్యూడీ పర్‌ఫార్మెన్స్ (AWD Performance) అనే వేరియంట్లలో ఈ కారు లభించనుంది.
బ్యాటరీ పవర్
డైనమిక్ వేరియంట్ 61.4 kWh LFP బ్లేడ్ బ్యాటరీల జత కలిగి ఉంటుంది. 204 హెచ్‌పీ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ కారు ముందుకు వెళుతుంది. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 510 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది.
650 కి.మీ ప్రయాణం
ప్రీమియం (Premium) వేరియంట్ 82.5 kWh LFP బ్లేడ్ బ్యాటరీల జత కలిగి ఉంది. 313 హెచ్‌పీ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌తో అది ముందుకెళ్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 650 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. AWD వేరియంట్.. 82.5 kWh బ్యాటరీ ప్యాక్, 530 hp పవర్ కలిగి ఉంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 580 కి.మీ వరకూ ప్రయాణించవచ్చు.
కారు డిజైన్
Ocean X concept కారును ప్రేరణగా తీసుకొని BYD Seal EV డిజైన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు రూఫ్ మెుత్తం గాజుతో ఉండటం విశేషం. అలాగే ఫ్లష్ ఫిట్టింగ్ డోర్స్, boomerang shaped LED లైట్స్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్‌ను కారు కలిగి ఉంది.
డిజిటల్ స్క్రీన్
BYD Seal EV Car లోపలి భాగంలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది. అలాగే 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. కారుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
కలర్స్
BYD Seal EV కారు మెుత్తం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. స్టీల్ గ్రే (Steel Gray), తెలుపు (White), నలుపు (Black), ఓషియన్ బ్లూ (Ocean Blue) కలర్ ఆప్షన్స్‌లో ఈ ఈవీ కారు లభించనుంది.
ధర ఎంతంటే?
థాయ్‌లాండ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ కారు ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే చాలా ఖరీదు అని చెప్పుకోవచ్చు. ఇండియన్ రూపీలో ఈ కారు ధర 29.8 లక్షలు. ఇంచుమించుగా భారత్‌లోనూ ఈ కారు ఇదే ధరను కలిగి ఉండవచ్చు.