కారులో మంటలు; నిండు గర్భిణీ సజీవదహనం
కారులో మంటలు చెలరేగడంతో నిండు గర్భిణీ సహా ఆమె భర్త కూడా సజీవదహనమయ్యారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రిషా, ప్రజిత్ దంపతులకు 8 ఏళ్ల శ్రీపార్వతి కూతురు ఉంది. ప్రజిత్ కాంట్రాక్టర్‌గా కాగా.. రిషా నిండు గర్భిణీ. ఈ క్రమంలో రిషాకు పురుటినొప్పులు రావడంతో కారులో కన్నూరు ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. ఇంతలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి భార్యభర్తలు ఇద్దరూ సజీవదహనమయ్యారు.