భారత దేశంలో ఎన్నో అత్యద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో కేబుల్ బ్రిడ్జిలకో ప్రత్యేక స్థానం ఉంది. నేల, నీటిపై తెలియాడుతున్నట్లు కనిపించే ఈ వంతెనలు చూపరులను కట్టిపడేస్తాయి. సెల్ఫీలు దిగమని ఆహ్వానిస్తాయి. సాయంత్రపు వేళల్లో ఈ కేబుల్ బ్రిడ్జిల వద్ద వీక్షకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ప్రజలు మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యాద్భుతమైన కేబుల్ బ్రిడ్ట్ నిర్మాణాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అటల్ సేతు (గోవా)
అటల్ సేతును దేశంలోనే అత్యంత అందమైన కేబుల్ బ్రిడ్జ్‌గా చెబుతారు. పనాజి-పోర్వోరిమ్ ప్రాంతాలను కలుపుతూ మండోవి నదిపై దీన్ని నిర్మించారు. భారత్‌లో మూడో అతిపొడవైన బ్రిడ్జ్‌గా అటల్ సేతు రికార్డుకెక్కింది. 5.1 కిలోమీటర్లు పొడవుండే ఈ బ్రిడ్జ్‌పై ప్రయాణం చేస్తే జీవితంలో ఎప్పటికీ మరిచిపోరని స్థానికుల చెబుతారు.
న్యూ నర్మదా బ్రిడ్జ్ (గుజరాత్)
గుజరాత్‌లోని భరూచ్ ప్రాంతంలో న్యూ నర్మదా కేబుల్ బ్రిడ్జ్ ఉంది. 1.3 కిలోమీటర్లు పొడవున్న ఈ కేబుల్ బ్రిడ్జ్‌ను నర్మదా నదిపై నిర్మించారు. వడోదర-సూరత్ నగరాలకు ప్రధాన మార్గంగా ఉన్న 8వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఈ బ్రడ్జ్‌ను ఏర్పాటు చేశారు.
కోటా చంబల్ బ్రిడ్జి(రాజస్థాన్)
రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో కోటా చంబల్ బ్రిడ్జిని నిర్మించారు. చంబల్ నదిపై నిర్మించడం వల్ల దాని పేరునే వంతెనకు పెట్టారు. భూమికి 60 మీటర్ల ఎత్తులో రూ.1.5 కి.మీ పొడవున ఈ బ్రిడ్జిను నిర్మించారు. ఈ వంతెన పైనుంచి చంబల్ నది అందాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి.
దుర్గం చెరువు బ్రిడ్జి(తెలంగాణ)
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందింది. రూ. 184 కోట్ల వ్యయంతో 754 మీటర్ల పొడవుతో తెలంగాణ ప్రభుత్వం దీనిని నిర్మించింది. దేశంలో అతిపెద్ద హ్యాగింగ్‌గు బ్రిడ్టిగా దుర్గం చెరువు వంతెన రికార్డుకెక్కింది.
బంద్రా-వర్లీ (మహారాష్ట్ర)
ముంబయిలోని బంద్రా-వర్లీ ప్రాంతాలను కలుపుతూ సముద్రంపై ఈ వంతెనను నిర్మించారు. సముద్ర మట్టానికి 126 మీటర్ల ఎత్తులో 5.6 కి.మీ పొడవున దీన్ని ఏర్పాటు చేశారు. సముద్రపు అలల గాలులు తగులుతుండగా ఈ వంతెనపై ప్రయాణించడం ఓ అద్భుతమనే చెప్పాలి.
విద్యాసాగర్ సేతు/ రెండో హూగ్లీ బ్రిడ్జి (బంగాల్)
బంగాల్‌లో కోల్‌కత్తా-హౌరా నగరాలను కలుపుతూ ఈ విద్యా సాగర్ సేతు బ్రిడ్జిని నిర్మించారు. దేశంలో పూర్తిగా కేబుల్స్‌తో నిండిన పొడవైన వంతెనగా ఇది రికార్డుకెక్కింది. హుగ్లీ నదిపై 822 మీటర్ల పొడవున దీన్ని నిర్మించారు.
న్యూ యుమనా బ్రిడ్జి (ఉత్తర్‌ప్రదేశ్)
యుమనా నదిపై అత్యంత సుందరంగా ఈ కేబుల్ వంతెనను నిర్మించారు. నైని-అలహాబాద్ ప్రాంతాలను కలుపుతూ ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో ఈ వంతెనను ఏర్పాటు చేశారు. 2004లో నిర్మాణం పూర్తైన ఈ వంతెన పొడవు 1.5 కిలో మీటర్లుగా ఉంది.
అటల్ సేతు బ్రిడ్జి (జమ్ము కశ్మీర్)
జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలో అటల్ సేతు బ్రిడ్జి ఉంది. ప్రధాని మోదీ ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. 592 మీటర్లు పొడవు ఉండే ఈ బ్రిడ్జి కశ్మీర్‌ను పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలను అనుసంధానం చేస్తోంది.
సిగ్నేచర్ బ్రిడ్జి (దిల్లీ)
దిల్లీలో యమున నదిపై సిగ్నేచర్ వంతెనను నిర్మించారు. 675 మీటర్లు పొడవైన ఈ వంతెనను నదికి 165 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
రాజా బోజ్ సేతు (మధ్యప్రదేశ్)
రాజా బోజ్ సేతు కేబుల్ బ్రిడ్జి భోపాల్ నగరంలో ఉంది. కమల పార్క్-వీఐపీ రోడ్‌ను కలుపుతూ దీన్ని నిర్మించారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది