• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యార్కర్ దెబ్బకు ఆస్పత్రి పాలు

    పాకిస్తాన్ బౌలర్ షాహిన్‌ అఫ్రిది యార్కర్ దెబ్బకు ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ రహమనుల్లా గుర్బాజ్ ఆస్పత్రి పాలయ్యాడు. బుధవారం పాక్‌-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అఫ్రిది వేసిన యార్కర్ నేరుగా గుర్బాజ్ కాలిని తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఫిజియో సపర్యలు చేపట్టినా నొప్పి తగ్గలేదు. దీంతో గుర్బాజ్‌ను సహచరుడు మోసుకుంటూ పెవిలియన్‌కు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. https://twitter.com/KuchNahiUkhada/status/1582619781186084865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1582619781186084865%7Ctwgr%5E71e604a57ab5171c1dba9fa0c8c04e6a861c0872%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsports%2Ft20-wc-2022-shaheen-afridi-yorker-sends-afghanistan-opener-hospital-1495110

    ఐసీసీపై కోహ్లి ఫ్యాన్స్ ఫైర్

    ఐసీసీ విడుదల చేసిన ఒక వీడియోపై భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఐసీసీ ఒక వీడియో రిలీజ్ చేసింది. కానీ అందులో రికార్డుల రారాజు కోహ్లీ లేడు. ఆ వీడియోలో రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, చాహల్‌లు మాత్రమే ఉన్నారు. దీంతో కోహ్లి అభిమానులు ఐసీసీపై గుర్రుగా ఉన్నారు. కింగ్ కోహ్లీ ఎక్కడ? కోహ్లి లేకుండా టీమిండియా అసంపూర్ణం.. అంటూ ఫ్యాన్స్ ట్వీట్ల వరద పారిస్తున్నారు. View this post on Instagram A … Read more

    యూఏఈ ఆటగాడి భారీ సిక్సర్

    యూఏఈ ఆటగాడు జునైద్ సిద్దిఖీ టీ20 వరల్డ్ కప్‌లో భారీ సిక్సర్ బాదాడు. శ్రీలంకతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇన్సింగ్స్ 17వ ఓవర్లో 109 మీటర్ల సిక్సర్ సంధించాడు. వికెట్లపైకి వచ్చిన బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా స్టేడియం దాటించాడు. ఈ మాన్‌స్టర్ సిక్సర్ బాదిన అనంతరం సిద్దిఖీ తన కండలు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ????? ?? ??? ???! Junaid Siddique, batter no. 10 and tailender, knocks … Read more

    మ్యాచ్ కాదు.. అంతకుమించి..

    భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోందని హాలీవుడ్ స్టార్, WWE రెజ్లర్ డ్వేన్ జాన్సన్ అన్నాడు. అది కేవలం మ్యాచ్ కాదని, అంతకుమించి అని ‘ది రాక్’ పేర్కొన్నాడు. ప్రపంచ అత్యుత్తమ ప్రత్యర్థులు ఢీకొనడం థ్రిల్లింగ్‌గా ఉందన్నాడు. కాగా డ్వేన్ జాన్సన్‌తో ఐసీసీ ఒక స్పెషల్ వీడియోతో ప్రమోషన్స్ చేయించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ నెల 23న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ తలపడనున్న సంగతి తెలిసిందే. .@TheRock is #ReadyForT20WC and … Read more

    హిట్టింగ్ చేసే మూడ్ లేదు: SKY

    ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(SKY)కి చెందిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ‘హిట్టింగ్ చేసే మూడ్ లేదు ఈరోజు’ అని హిందీలో అంటుండగా స్టంప్ మైక్‌లో రికార్డయింది. చిత్రమేమిటంటే ఆ తర్వాత బంతికే SKY ఔటయ్యాడు. అది కూడా ఫుల్ టాస్ బంతిని డీప్ స్క్వేర్ మీదుగా త్వరగా ఆడబోయాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకొని బౌలర్ చేతికి వెళ్లింది. కాగా, ఈ మ్యాచులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. @surya_14kumar – … Read more

    స్టేడియంలోనే క్రికెటర్ల డ్యాన్స్

    మ్యాచ్ గెలిస్తే ఆ ఆనందమే వేరు. అయితే శ్రీలంక జట్టు మహిళలు ఓ అడుగు ముందుకేసి ఏకంగా స్టేడియంలోనే స్టెప్పులేశారు. మహిళల ఆసియాకప్‌ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక ఒక పరుగు తేడాతో గెలుపొందింది. దీంతో 14ఏళ్ల తర్వాత ఫైన‌ల్‌కి చేరామన్న ఆనందంతో.. ఓ పాట పెట్టుకుని మైదానంలోనే ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇదివరకే ఫైనల్ చేరిన భారత్‌తో టైటిల్ పోరులో లంకేయులు తలపడనున్నారు. ఆసియాకప్‌ 2022ని శ్రీలంక చేజిక్కించుకున్న అనంతరం, మహిళా జట్టు కూడా ఫైనల్ చేరడం గమనార్హం. #ApeKello celebrating in style … Read more

    ‘మ్యాథ్యూ వేడ్.. ఇదేం పని?’

    క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తి చాలా ముఖ్యం. కానీ ఆసీస్ బ్యాటర్ మ్యాథ్యూ వేడ్ దీనికి విరుద్ధంగా వ్యవహరించి విమర్శల పాలవుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 రెండో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వేడ్ ఔటర్ ఎడ్జ్‌ని తీసుకుని బంతి గాల్లోకి ఎగిరింది. దీంతో క్రీజులోకి వెళ్తున్నట్లు నటిస్తూ క్యాచ్ పట్టుకోనివ్వకుండా మార్క్‌వుడ్‌ని ఎడమచేత్తో వేడ్ నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ గ్యాప్‌లో బంతి నేలను తాకింది. దీనిపై కెప్టెన్ బట్లర్ అప్పీల్ చేయక పోవడంతో మ్యాచ్ అలాగే కొనసాగింది. అయితే ఈ పోరులో ఆసీస్‌పై ఇంగ్లండ్ … Read more

    ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్ అనుమానమే!

    లక్నోలో జరగనున్న ఇండియా-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ నిర్వాహణ అనుమానంగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు టాస్ వాయిదా వేశారు. ఔట్ ఫీల్డ్ పిచ్ పరిశీలించిన అంపైర్లు మరికొద్దిసేపట్లో మ్యాచ్ నిర్వాహణపై నిర్ణయం తీసుకోనున్నారు. మ.1.30గం.లకే టాస్ వేసి 2గంటలకు మ్యాచ్ స్టార్ట్ కావాల్సి ఉంది. [వర్షం ](url)తగ్గకపోవడంతో మ్యాచ్‌ నిర్వహాణపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు మ్యాచ్ నిర్వహణపై త్వరలోనే పూర్తి సమాచారం ఇస్తామని బీసీసీఐ ట్వీట్ చేసింది. Update ? Rain has gotten heavier here in Lucknow and the toss … Read more

    అర్ధగంట ఆలస్యంగా నేటి మ్యాచ్

    ఈరోజు జరగనున్న ఇండియా- సౌతాఫ్రికా తొలి వన్డేకు వరణుడు అడ్డుగా నిలవనున్నాడు. ఈమేరకు మధ్యాహ్నం 1.30గం.కు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అరగంట ఆలస్యంగా మ.2గంటలకు ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. టాస్ మ.1.30గంటలకు వేయనున్నట్లు వెల్లడించింది. అటు వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా [ప్రాక్టిస్](url) చేస్తున్నారు. Preps ✅#TeamIndia ready for the #INDvSA ODI series. ? ? pic.twitter.com/5fY3m1a8lq — BCCI (@BCCI) October 6, 2022

    లెజెండ్స్‌ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌, జాన్సన్‌ ఫైట్‌

    రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా లెజెండ్స్‌ మ్యాచ్‌లో ఓ గొడవ తలెత్తింది. భారత జట్టులోని యూసుఫ్‌ పఠాన్‌, ఆస్ట్రేలియాలోని జాన్సన్‌ మాటల యుద్ధానికి దిగారు. పరస్పరం తోసుకున్నారు. మిగతా ఆటగాళ్లు కలుగజేసుకుని వారి గొడవను సద్దుమణిగించారు. ఈ ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటే కవ్వింపులతో వాడీవేడిగా సాగేది. ఆటగాళ్లు వయసు పెరిగి నిష్క్రమించినా వారిలో జోరు మాత్రం తగ్గలేదంటూ పలువురు ఈ వీడియోలకు కామెంట్లు చేస్తున్నారు. https://youtube.com/watch?v=MkkWgIDWhd4