• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘సూర్య’ క్రాకింగ్ సిక్సర్ చూశారా?

  టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో అర్థసెంచరీతో చెలరేగి భారత్‌కు విజయం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సూర్య మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని అందరూ పొగుడుతున్నారు. కాగా సూర్య కొట్టిన భారీ సిక్సర్ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. Hit it like SKY! ??Enjoy that cracking SIX ? ? Follow … Read more

  ‘మిస్టర్ ఐపీఎల్’ స్టన్నింగ్ క్యాచ్

  ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి తనలో ఇప్పటికీ ఏమాత్రం జోరు తగ్గలేదని నిరూపించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సీరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్ తరఫున ఆడుతున్న రైనా.. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత క్యాచ్ పట్టాడు. 16వ ఓవర్‌లో అభిమన్యు మిథున్ వేసిన బంతిని.. బెన్ డంక్ పాయింట్ వైపు ఆడాడు. అక్కడే ఉన్న రైనా ఎడమ వైపునకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో మైదానంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. … Read more

  Suryakumar Yadav: స్వప్నించి.. శ్రమించి.. సాధించిన ఆటగాడు.. మిస్టర్ 360 

  అది 2019 ఐపీఎల్ సీజన్. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టులో ఓ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దుమ్ము రేపుతున్నాడు. అతడి ఆటతీరు చూస్తుంటే.. వరల్డ్‌కప్‌కు టీమిండియాలో చోటు పక్కా అనే మాటలు వినిపించాయి. అతడే సూర్యకుమార్ యాదవ్. ఇదే ఊపును కొనసాగిస్తూ.. ముంబై జట్టు టైటిల్ గెలవడంలో SKY కీ రోల్ పోషించాడు. టీమిండియా జట్టు ప్రకటన రానే వచ్చింది. కానీ, అందరూ అనుకున్నట్లుగా సూర్యకి జట్టులో చోటు దక్కలేదు. టీమిండియాకు ఆడాలన్న కల.. ఆరోజుకి కలగానే మిగిలిపోయింది. కట్ చేస్తే.. … Read more

  తిరువనంతపురం చేరుకున్న భారత ఆటగాళ్లు

  దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు తిరువనంతపురం చేరుకున్నారు. వీరికి అక్కడ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. పూలజల్లుతో ఆహ్వానించి.. నుదుట తిలకం దిద్దించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. హలో తిరువనంతపురం అంటూ అందులో రాసుకొచ్చింది. వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి. Hello Thiruvananthapuram ? Time for the #INDvSA T20I series. … Read more

  హలో హైదరాబాద్ అంటూ BCCI స్పెషల్ వీడియో

  ఇండియా, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ‘హలో హైదరాబాద్’ అంటూ ఓ స్పెషల్ [వీడియోను](url) ట్వీట్ చేసింది. ఆ వీడియోలో భారత ఆటగాళ్లు నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు చేసిన జర్నీని చూపించింది. కాగా మరోకొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. Nagpur ✅ Hello Hyderabad! ?#TeamIndia | #INDvAUS pic.twitter.com/gIey9Ncqm8 — BCCI (@BCCI) September 25, 2022

  మన్కడ్‌ చేసిందని ఏడ్చుకుంటూ వెళ్లింది

  భారత మహిళల జట్టుకు ఇంగ్లండ్‌ జట్టుతో తలపడిన వన్డే మ్యాచ్‌లో దీప్తి శర్మ మన్కడింగ్‌ మరోసారి చర్చ రేకెత్తిన విషయం తెలిసిందే. అయితే అవుటైన తర్వాత ఇంగ్లండ్‌ బ్యాటర్ ఏడ్చుకుంటూ వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చివరి ఆరు ఓవర్లల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో ఛార్లీ డీన్ అనూహ్యంగా అవుట్ అయింది. 44 ఓవర్‌లో దీప్తి శర్మ తనను మన్కడ్‌ చేసింది. అప్పటికి తను 47 పరుగులు చేసింది.దీంతో చార్లీ కన్నీంటి పర్యంతమైంది. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఫ్రేయా డేవిస్ … Read more

  Jasprit Bumrah: బుమ్రా టీమిండియాకు ఎందుకంత కీలకం?

  ‘ఛ.. బుమ్రా ఉంటే బాగుండేది. బుమ్రా అయితే పరుగులను కట్టడి చేసేవాడు. బుమ్రా అయితే వికెట్ తీసేవాడు’ ఆస్ట్రేలియాతో తొలి T20 మ్యాచ్ చూస్తుండగా ఇలాంటి భావనే అందరికీ కలిగింది. భారత బౌలర్ల ప్రదర్శన అలా ఉంది మరి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మన బౌలర్లు చేతులెత్తేస్తుంటే అందరికీ బుమ్రానే గుర్తుకొచ్చాడు. ఆసియాకప్‌లోనూ బుమ్రా ఉంటే మరోలా ఉండేదేమో? నిజంగా బుమ్రా అంత ప్రభావం చూపగలడా..? అతడిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? గణాంకాలు ఏం చెబుతున్నాయి?  జస్ప్రిత్ బుమ్రా.. భారత జట్టు బౌలింగ్ దళానికి … Read more

  బంతిని ఆపిన హెల్మెట్..!

  కీపింగ్ చేసే సమయంలో ఒక్కోసారి హెల్మెట్‌ని తమ వెనకాల పెట్టుకుంటుంటారు వికెట్ కీపర్లు. అయితే, ఆ హెల్మెట్‌ వల్ల పరుగులకు అంతరాయం కలిగితే బ్యాటింగ్ జట్టుకు అదనపు పరుగులు అంపైర్ ఇస్తాడు. ఇండియా మహారాజస్, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే ఘటన చోటుచేసుకుంది. అశోక్ దిందా వేసిన ఓవర్లో కీపర్ వెనకాల ఉన్న హెల్మెట్‌ని బాల్ నెమ్మదిగా తాకి ఆగిపోయింది. దీంతో వరల్డ్ జెయింట్స్‌కి అంపైర్ 5పరుగులు ఇవ్వడంతో ప్లేయర్లు కాసేపు నవ్వుకున్నారు. 5 Runs when ball Hits Keeper … Read more

  రైనా పాటలు.. యువీ స్టెప్పులు

  ఓవైపు ఇండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల టీ20 సిరీస్‌కి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు మాజీ ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ ట్రోఫీలో భాగంగా ఇండియా లెజెండ్స్ నేడు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు కాస్త సరదాగా గడిపారు. హిందీ పాటకు యువీ డ్యాన్స్ చేస్తుంటే.. సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ మైకులు పట్టుకున్నారు. తెందుల్కర్ ఫోన్ చూస్తున్నాడు. ఈ వీడియోను యువీ షేర్ చేశాడు. వాట్ ఎ నైట్ అంటూ ఇర్ఫాన్ ఈ పోస్టుకు కామెంట్ చేశాడు. View this post on … Read more

  స్టేడియంలో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి ప్ర‌పోజ్ చేసిన క్రికెట‌ర్‌

  ఆసియాక‌ప్‌లో భాగంగా బుధ‌వారం భార‌త్, హాంకాంగ్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హాంకాంగ్‌పై భార‌త్ 40 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయితే ఆట ముగిసిన త‌ర్వాత హాంకాంగ్ ఆట‌గాడు కించిత్ షా గ్రౌండ్‌లో అంద‌రూ చూస్తుండ‌గానే త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు ప్ర‌పోజ్ చేశాడు. మోకాళ్ల‌పై కూర్చొని ఆమెకు రింగ్ తొడిగాడు. దీంతో ఆమె ఫిదా అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ ఓడిన‌ప్ప‌టికీ ప్రేమ‌ను గెలిచాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.