• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిట్టింగ్ చేసే మూడ్ లేదు: SKY

    ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(SKY)కి చెందిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ‘హిట్టింగ్ చేసే మూడ్ లేదు ఈరోజు’ అని హిందీలో అంటుండగా స్టంప్ మైక్‌లో రికార్డయింది. చిత్రమేమిటంటే ఆ తర్వాత బంతికే SKY ఔటయ్యాడు. అది కూడా ఫుల్ టాస్ బంతిని డీప్ స్క్వేర్ మీదుగా త్వరగా ఆడబోయాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకొని బౌలర్ చేతికి వెళ్లింది. కాగా, ఈ మ్యాచులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv